Monday, October 31, 2016

మునిమాణిక్యం వారిని ఇబ్బందిపెట్టిన “లంగూడి”

ఏదన్నా పదములోనిదికాని, వాక్యములోనిదికాని ఏవన్నా అక్షరంముక్కలు పట్టుకొని వాటికి అర్ధం చెప్పమంటే, ఎంతటి నిష్ణాతులైనా తడుముకోవలసిందే. ఒకసారి ఓ కొంటెవిద్యార్ధి మునిమాణిక్యం వారిని ‘లంగూడి’ అంటే ఏమిటండీ అని అడిగాడుట, అలాగే ఓ తుంటరి విద్యార్ధి రావణుడి ఇంటిపేరు ఏమిటి అని అడిగాడుట. రామాయణాన్ని కాచివడపోసినవారే చెప్పలేరు రావణుని ఇంటిపేరు. మరి ఈ వృత్తాంతమేమిటో చూద్దాము, మునిమాణిక్యం వారి ‘మన హాస్యము’ నుండి. ఈ ‘లంగూడి’ ప్రకరణాన్ని గురించి మరింత విపులంగా వారి ‘ఉపాధ్యాయుడు’ పుస్తకంలో వుంది. దాన్ని కూడా పోస్ట్ చెయ్యటం జరిగింది. 


























Tags: Munimanikyam Narasimharao, Mana Hasyamu,

Saturday, October 29, 2016

తొలినాటి తెలుగు సినిమా పాటల పుస్తకాలు

మనకు ఆరోజుల్లో పాటల పుస్తకాలంటే ఏ బస్ స్టాండ్ పుస్తకాల షాపులోనో లభించే ‘గొల్లపూడి’ వారి ‘ఘంటసాల’ పాటల పుస్తకాల వరకే తెలుసు. అప్పట్లో కొద్దిమంది సినిమా రచయితలవి పాటలు, పుస్తకాలుగా వచ్చాయి. తరువాత్తరువాత ‘ఈనాడు’వారి ‘పాడుతాతియ్యగా’ మూలంగా పాటల పుస్తకాలకు డిమాండు బాగా పెరిగి ఇప్పుడు రచయితల, సంగీత దర్శకుల, గాయనీగాయకులవారీగాకూడా పాటలపుస్తకాలు దొరుకుతున్నాయి. అయితే తొలినాటి నుండి కూడా ఈ పాటలపుస్తకాలు సినిమాల వారీగా వచ్చాయి. కొంతమంది ఔత్సాహికులు దూరదృష్టితో ఈ పుస్తకాలను భద్రపరిచారు. వారిలో విజయవాడలోని శ్రీ భైరవభొట్ల వెంకటనారాయణరావు గారు ప్రసిద్ధులు. ఇప్పుడు అందరూ సంకలనకర్తలే గాని, అసలు సేకరణకర్తలు ఎవరో తెలియటంలేదు. 

1933 నుండి 1950 వరకు వచ్చిన సినిమాల తాలూకు పాటల పుస్తకాల ముఖచిత్రాలు ఒక 140కి పైగా ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది. ఇవన్నీ కూడా సఖియా.కామ్ వారి వెబ్ సైట్ నుండి సేకరించినవి. ఇప్పుడు ఈ వెబ్ సైట్ లేదు, పుస్తకాలు లేవు. ఇవి ఇక్కడ పోస్ట్ చెయ్యటంలో ఉద్దేశం ఒకప్పుడు ఇలాంటి పాటల పుస్తకాలు వచ్చాయి అని తెలియచెప్పటానికి మాత్రమే. 1933 నుండి వచ్చిన సినిమాల ప్రకటనలు లభించినంతవరకు పాత సంచికల నుండి సేకరించి పోస్ట్ చేసుకుంటూ రావటం జరుగుతోంది. ఆ క్రమంలో ఇదొక భాగం. క్రెడిట్ అంతాకూడా సఖియా.కామ్ వారికే చెందుతుంది. 

అసలు ఈ పాటల పుస్తకాలవల్ల ఉపయోగమేమిటి అనుకోవచ్చు. ఎవరి అభిరుచి వారిది. పైడిపాల వారు ‘తెలుగు సినిమా పాట చరిత్ర’, ‘తెలుగు సినిమాల్లో డబ్బింగ్ పాటలు’ అనే అంశాలపై సిద్ధాంత గ్రంధాలు సమర్పించి, అనేక ఆసక్తికర విషయాలు తెలియచేసారు. ఈ పాటల పుస్తకాలల్లో ఎంతో విలువైన సమాచారం వుంది. ఇవన్నీ కూడా మన తెలుగుసినిమా చరిత్రలో భాగమే. 1933 – 1940 మధ్య వచ్చిన సినిమా పాటలు రెండు సంపుటాలుగా ప్రచురించారు. ఇవి కొన్ని పుస్తకాల షాపుల్లో దొరుకుతున్నాయి. చివర్లో పైడిపాల గారి పుస్తకాల ముఖచిత్రాలతోబాటు , సి.నా.రె., దేవులపల్లి, ఆత్రేయ, ఆరుద్ర గార్ల పాటల పుస్తకాల ముఖచిత్రాలు కూడా పోస్ట్ చెయ్యటం జరిగింది. 
















































































































































































చివరగా 1937లో వచ్చిన దశావతారములు అన్న సినిమా నుండి ఒక పాట


..




ఎటువంటి అభ్యంతరాలున్నా ఈ పోస్ట్ తొలగించబడుతుంది.




Tags: Old Telugu Cinema Songs Books, patala books, patala pustakalu, Songs books,