ప్రముఖ కవి, రచయిత శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారి హాస్యరచన “డాక్టర్”. ఇది వారి రచన “మువ్వగోపాల” నుండి గ్రహించటం జరిగింది. ఇది 1961 లో వచ్చిన ప్రచురణ. కాటూరి వారు ఆకాశవాణి వారి కోసం రాసిన శ్రవ్యనాటికలు “మువ్వగోపాల” పుస్తకంగా ప్రచురించారు. ఆద్యంతం చతురోక్తులతో సాగుతుంది ఈ నాటిక.
చిలకమర్తి వారి రేడియో నాటకం “గణపతి”లో సింగమ్మగా – పి. సీతారత్నం, గణపతిగా – నండూరి సుబ్బారావు గార్ల వాచకం గుర్తుండే వుంటుంది. ఈ డాక్టర్ నాటకం చదివేటప్పుడు “రోగి” పాత్రలో నండూరివారిని, “తల్లి” పాత్రలో సీతారత్నంగారిని ఊహించుకొని చదివిచూడండి. మరి ఈ నాటకం ఆకాశవాణి వారి వద్ద లభిస్తోందా అన్నది తెలియదు.
కాటూరి వారి రచనతో పాటు వారి చేవ్రాలు, ఫోటో, వివరాలు, స్వరం కూడా పోస్ట్ చెయ్యటం జరిగింది. చూడటానికి పెద్దగా అనిపించినా, మొదలుపెడితే ఇట్టే చదివేయగలరు.
ముద్దుకృష్ణ గారి వైతాళికులు నుండి
|
కాటూరి, పింగళి లక్ష్మీకాంతం గార్లు
|
Tags: Katuri
Venkateswararao, Kaaturi, Kaatoori, Katoori, Muvvagopala, Pingali
Lakshmikantam, Chellapilla Venkata Sastry,