బహుశ ఆరుద్ర గారు అన్నారను కుంటాను “భూమి మీద ధ్వని నిలబడినంత కాలం ఘంటసాల గారి గొంతు వినబడుతునే వుంటుందని”. ఇప్పుడు ఉన్న సాంకేతిక సహకారం వల్ల అది సాధ్యమే. అది ఆయన పూర్వజన్మ సుకృతం. ఫిబ్రవరి 11 ఘంటసాల గారి వర్ధంతి సంధర్భంగా రెండు రేడియో రికార్డింగ్స్ కింద పోస్ట్ చేస్తున్నాను.
చాలా కాలం కిందట హైదరాబాద్
కేంద్రం నుండి ప్రసారమైనది. అయితే రికార్డింగ్ చేసే సమయానికి కొంత
ప్రోగ్రాం అయిపోయినట్లుంది. దీంట్లో సి.
నారాయణ రెడ్డి గారు ఘంటసాల గురించి చెప్పిన మాటలు, ఒక
మూడు, నాలుగు
ఘంటసాల గారి పద్యాలు, ఆయన బహుశ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ
నుండి కొన్ని మాటలు వినబడతాయి.
అలాగే ఘంటసాల గారు పాడిన కొన్ని
పాటల బిట్స్, చివర్లో
ఆయన మాటలు ఈ కింద వినండి. ఇది గూడా జనరంజనిలో ప్రసారమైనది.
No comments:
Post a Comment