దేవతా మూర్తుల దండకాలు నిత్యం వింటూనే వుంటాము. ఆఫీసుల్లో, సంసారాల్లో దండకాలు సరేసరి. కానీ ఈ ఓటు దండకం అయిదేళ్ళకోసారి వినబడుతుంది. ఎప్పుడో కృష్ణా పత్రికలో ప్రచురితమైన ఈ ఓటు దండకాన్ని తిరిగి కొద్ది మార్పులతో గోల్కొండ పత్రికలో 1934లో ప్రచురించారు. ఈ దండకాన్ని వెలుగులోకి తెచ్చినవారు పోలాప్రగడ సత్యన్నారాయణ మూర్తి గారు. మన రాష్ట్ర సాహిత్య అకాడమీ వారు 1982లో పోలాప్రగడ వారి సంపాదకత్వంలో “హాస్యతోరణము” అనే పుస్తకాన్ని ప్రచురించారు. ముందుగా గోల్కొండ పత్రికలోని (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో) తరువాత హాస్యతోరణంలోని ఓటు దండకాన్ని చూద్దాము. ఈ మధ్య మిధునం సినిమాలో కాఫీ దండకాన్ని వినిపించారు. అదే తరహాలో దీన్ని కూడా చదువుకుంటే బావుంటుంది.
No comments:
Post a Comment