ఈ చిత్రాలు 1972 నాటి ఆంధ్రప్రభ వారపత్రికలలో వచ్చినవి. కొన్ని సంచికలు లభించకపోవటంతో వీటి పూర్వాపరాలు తెలియవు. వీటిని చిత్రించిన వారు శ్రీ పి. ఎం. శ్రీనివాసన్ గారు అని తెలుస్తోంది. వీరి గురించిన మరింత సమాచారం కొరకు కింది లింకులు చూడవచ్చు. ఇవి ప్రెస్ అకాడమీ వారి సైట్ నుండి గ్రహించటం జరిగింది. వీటిని పుస్తకం మధ్య పేజీలలో ప్రచురించటంతో స్కాన్ చేసినవారు రెండు పేజీలుగా స్కాన్ చేసి PDF ఫార్మాట్లో పెట్టటం జరిగింది. వాటిని జాగ్రత్తగా తిరిగి కలిపి ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది. ఎలాగో లేపాక్షి ప్రస్తావన వచ్చింది కాబట్టి “లేపాక్షి బసవయ్య లేచి రావయ్యా” అన్న అడవి బాపిరాజు గారి గేయం విందాము.
Source: facebook.com/pages/Silpi |
మరింత సమాచారం కొరకు కింది లింకులు చూడవచ్చు
https://www.facebook.com/pages/Silpi/514570925255352
http://artistshilpi.blogspot.in/
http://en.wikipedia.org/wiki/Silpi
Tags: Silpi, Lepakshi, Vijayawada, Adavi Bapiraju, Lepakshi basavayya lechiravayya,
లలపై శిల్పాలు పాట గుర్తుకు వచ్చింది. బొమ్మలు ఎంతొ ఎంతో బాగున్నాయి. నిజంగా ఆ శిల్పాల ముందు మనం నిలుచున్న భావన వుంది. 'శిల్పీ చిత్ర ప్రతిభ అసామాన్యం. ఆ ప్రతిభ ని మా అందరికి పంచినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు.
ReplyDeleteశ్రీనివాసరావు వి ,ఖమ్మం
శిల్పాల బొమ్మలూ, వాటిలోని సూక్ష్మ అంశాల చిత్రణా గొప్పగా ఉన్నాయి. వీటిని అందించినందుకు థాంక్యూ.
ReplyDeleteశ్రీనివాసరావు గారికి, వేణు గారికి మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు
Delete