Wednesday, January 9, 2013

1930 ప్రాంతం నాటి బెజవాడ ఫోటోలు

ఆంధ్రభూమి, ఆంధ్రపత్రిక లలో (ప్రెస్ అకాడమీ సౌజన్యం) 1934 ప్రాంతాల్లో ప్రచురితమైన బెజవాడ ఫోటోలు కొన్ని చూద్దామా. అప్పటికి ప్రకాశం బ్యారేజి కట్టలేదు. వన్ టౌన్ దగ్గరి కాలువలో పడవలు చూశారా. ఆ రోజుల్లో బెజవాడ నుండి చెన్నపురికి బకింగ్ హామ్ కాలువ ద్వారా పడవలు నడిచేవనేవారు. ఈ ఫోటో చూశాక నిజమేనేమో అనిపిస్తోంది. 

వంద సంవత్సరాల క్రిందటి హైదరాబాద్ ఫోటోలు ఒక 70 దాకా, అలాగే బెజవాడ, కొండపల్లి, వరంగల్, ఇతర ప్రాంతాలకు చెందిన అనేక పాత కాలం నాటి అరుదైన ఫోటోలు బ్రిటిష్ లైబ్రరి వాళ్ళ వెబ్ సైట్లో నిక్షిప్తం చేసి వున్నాయి. అవి ఇక్కడ ప్రదర్శించటానికి కాపీ రైట్ అడ్డంకులు వస్తాయి. ఎంతైనా పాత ఫోటోలు చూస్తే కలిగే ఆనందమే వేరు.

ఫోటోలను వేరే విండోలోగాని, టాబు లోగాని ఓపెన్ చేసి పెద్దవిగా చూడండి.





No comments:

Post a Comment