Thursday, February 28, 2013
Monday, February 25, 2013
1938 లో విడుదలైన కొన్ని చిత్రాల వివరాలు
ఈ సంవత్సరంలో పది సినిమాలు విడుదల అయ్యాయి. ఆ చిత్రాల తాలూకు కొన్ని లభ్యమైన పోస్టర్స్ కింద పోస్ట్ చేస్తున్నాను. ఇవి ప్రెస్ అకాడమీ వారి వెబ్ సైట్ లోని పాత తెలుగు సంచికల నుండి తీసుకోవటం జరిగింది.
పుష్పవల్లి గారి (హిందీ నటి రేఖ తల్లి) ఫోటో
చూస్తుంటే బాలనాగమ్మలో (1942) ఆవిడ పాడిన ఈ కింది పాట గుర్తుకు వస్తోంది.
Friday, February 22, 2013
Tuesday, February 19, 2013
Thursday, February 14, 2013
ఏ తేదీకైనా వారము తెలుసుకొనుట ఎలా
అష్టావధానము జరుగుతున్నప్పుడు భలానా సంవత్సరము భలానా తారీకు ఏ వారము అని అడగంగాన్లే అవధాని గారు ఠకీమని భలానా వారమని చెబుతారు. ఎలా చెప్పగల్గుతారా అని ఆశ్చర్యమేసేది. ఈ మధ్య ప్రెస్ అకాడమీ వారి పాత సంచికలు చూస్తుంటే ఆంధ్ర మహిళ సంచికలో దీని గురించి ఒక ఆర్టికల్ కనబడింది. అది కింద పోస్ట్ చేస్తున్నాను. దీని ప్రకారం చూసినా మనసులో లెక్కలు గట్టి వెంటనే చెప్పగలగటం గొప్ప విషయమే. బహుశా కొన్ని బండ గుర్తులు ముందే లెక్క గట్టి పెట్టుకొని చెబుతారేమో. ఇంతకీ మీ పుట్టిన రోజు ఏ వారమైనదో లెక్కగట్టి చూసుకోండి.
ఒక వేళ మీరు క్యాలుక్యులేటర్ వాడినా
ఏడుతో మటుకు మామూలుగా పేపరు మీద భాగించి చూస్తేనే మనకు సమాధానం వస్తుంది.
Wednesday, February 13, 2013
Sunday, February 10, 2013
ఘంటసాల గళాన హృద్యమైన తెలుగు పద్యం – రేడియో రికార్డింగ్
బహుశ ఆరుద్ర గారు అన్నారను కుంటాను “భూమి మీద ధ్వని నిలబడినంత కాలం ఘంటసాల గారి గొంతు వినబడుతునే వుంటుందని”. ఇప్పుడు ఉన్న సాంకేతిక సహకారం వల్ల అది సాధ్యమే. అది ఆయన పూర్వజన్మ సుకృతం. ఫిబ్రవరి 11 ఘంటసాల గారి వర్ధంతి సంధర్భంగా రెండు రేడియో రికార్డింగ్స్ కింద పోస్ట్ చేస్తున్నాను.
చాలా కాలం కిందట హైదరాబాద్
కేంద్రం నుండి ప్రసారమైనది. అయితే రికార్డింగ్ చేసే సమయానికి కొంత
ప్రోగ్రాం అయిపోయినట్లుంది. దీంట్లో సి.
నారాయణ రెడ్డి గారు ఘంటసాల గురించి చెప్పిన మాటలు, ఒక
మూడు, నాలుగు
ఘంటసాల గారి పద్యాలు, ఆయన బహుశ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ
నుండి కొన్ని మాటలు వినబడతాయి.
అలాగే ఘంటసాల గారు పాడిన కొన్ని
పాటల బిట్స్, చివర్లో
ఆయన మాటలు ఈ కింద వినండి. ఇది గూడా జనరంజనిలో ప్రసారమైనది.
Saturday, February 9, 2013
Subscribe to:
Posts (Atom)