గతంలో “మన మధురగాయకులు” పేరిట కొంతమంది గాయనీ గాయకుల వివరాలు, పాటలు పోస్ట్ చెయ్యటం జరిగింది. ఈసారి “మన రంగస్థల నటులు” పేరిట రంగస్థల నటులకు సంబంధించిన వివరాలు, ఫోటోలు, పాటలు, పాటల సాహిత్యం ఒకచోటగా తెద్దామని ప్రయత్నం. ఎటువంటి అభ్యంతరాలున్నా తొలగించబడతాయి.
ముందుగా శ్రీ
చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్ గారి గురించి తెలుసుకుందాము. వారి వివరాలు శ్రీ మిక్కిలినేని
రాధాకృష్ణ మూర్తి గారి “నటరత్నాలు” నుండి స్వీకరించటం జరిగింది.
వీరు పాడిన ఒకపాట “రామయతండ్రి ఓ రామాయతండ్రి” విందాము. ఘంటసాల గారి పాటకు ఇది మాతృకగా అనిపిస్తుంది. ఆడియోను శ్రీ
మొదలి నాగభూషణ శర్మ గారి “తొలినాటి గ్రామఫోన్ గాయకులు” రెండవ సంపుటి నుండి గ్రహించటం జరిగింది. ఈ పాటల సి.డి.లు పుస్తకాల షాపుల్లో లభిస్తాయి. ఆసక్తి ఉన్నవారు
సేకరించండి.
Tags:
choppalli suryanarayana bhagavatar, modali nagabhushana sarma, mikkilineni
radhakrishna murthy, ramaya tandri o ramayatandri,
No comments:
Post a Comment