Wednesday, May 11, 2016

“తెలుగు రచయిత” నూతన వెబ్సైటు – చిన్న పరిచయం

ఈమధ్య కొంతమంది ఔత్సాహికుల సారధ్యములో  “తెలుగు రచయిత” అన్న ఒక వెబ్సైటు ప్రారంభం అయింది. తెలుగు రచయితల విషయాలు ఒకచోటగా క్రోడీకరించటం చాలా మంచి విషయం, కానీ అంత తేలికైన వ్యవహారం కాదిది. 





ఆదికవి నన్నయ్య
Source: http://www.nannayauniversity.info/

















ముందు తెలుగులో ఎంతమంది రచయితలు ఉన్నారన్నదానికి ఒక లెక్క పత్రం రాయటమే చాలా కష్టం. వీరేశలింగం గారి “ఆంధ్ర కవుల చరిత్రము” మధునాపంతుల వారి “ఆంధ్ర రచయితలు” ఇంకా రచయితల విషయాలు తెలియజేసే అనేకానేక పుస్తకాలను చూడాల్సి వుంటుంది. భారతి లాంటి పాత సంచికల విషయసూచికలను తిరగేస్తే చాలామంది రచయితల పేర్లు బయల్పడతాయి. వారివారి రచనలు వారిపేరున ప్రత్యేకంగా పుస్తకరూపంలోవచ్చిన, వారినే రచయితల కింద గ్రహించాలా లేక అడపాదడపా సంచికలలో వ్యాసాలు అవి రాసినవారినిగూడా రచయితల కింద జమ కట్టాలా అన్నది కూడా ప్రశ్న. 

















ఈనాడు అంతర్జాలంలో DLI, Press Academy, Internet Archive, Wikipedia, YouTube, Telugu Blogs, మొదలైన చోట్ల అధిక సమాచారం లభిస్తోంది. వీటిల్లో పుస్తకాలు, ఆడియోలు, వీడియోలు, ఫోటోలు విశేషంగా లభిస్తున్నాయి, ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి. 

కేవలం ఒక ఫోటో కాకుండా వీలైనన్ని ఎక్కువ ఫోటోలు ఆయా రచయితలవి పెడితే బావుంటుంది. అలాగే వారి రచనల పేర్లు తెలియపరచటంతోబాటుగా వారి రచనల ముఖచిత్రాలు పెడితే కలకాలం ఆ పేర్లు గుర్తుండిపోతాయి. అలాగే వారి చేవ్రాలు, సంతకాలు కూడాను. ఇంతకుముందు ఈ బ్లాగులో పోస్ట్ చేసిన కొంతమంది రచయితల చేవ్రాలు ఈ  లింకు ద్వారా చూడవచ్చు. 

కొంతమంది పేరున్న రచయితల జన్మదిన మరియు ఇతర సంధర్భాలలో ప్రత్యేక సంచికలు, పుస్తకాలు వస్తూవుంటాయి. వాటిల్లో అరుదైన ఫోటోలు, విషయాలు కనబడుతూవుంటాయి. వీటిమీద గూడా దృష్టి సారించాలి.

ఇతర కళాకారులు మంగళంపల్లి, నటరాజ రామకృష్ణ లాంటి వారు కూడా తెలుగులో రచనలు చేసి వున్నారు. వారికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. 

ఇప్పటి తరంవాళ్ళ ఇంటర్వ్యూల వీడియోలు అవి ఎవరన్నా టి.వి.ల వాళ్ళు రికార్డుచేసినవి యూట్యూబ్ లో లభించవచ్చు. కానీ ఇప్పటి, పాతతరంవాళ్ళ ఆడియోలు కావాలంటే మటుకు ఆకాశవాణి వారే శరణ్యం. మళ్ళీ వీటిల్లో రెండు రకాలు, మొదటిది ఒక రచయితను వేరే రచయిత ఇంటర్వ్యూ చేయటం, రెండోది ఒక రచయిత గురించి మరో రచయిత వివరించటం. ఆకాశవాణి వారికన్నా ఆ మాత్రం ముందుచూపు వున్నది కాబట్టి వారు వీలునుబట్టి పేరున్న రచయితలతో ఇంటర్వ్యూలు సలిపి ఆ రికార్డులు వీలున్నంతలో భద్రపరిచి వీలున్నప్పుడు ప్రసారం చేయటం జరుగుతోంది. ఎవరో కొంతమంది ఆకాశవాణి వారి వీరాభిమానులు దూరదృష్టితో, ఆయా ప్రసారాలు రికార్డు చేసి దాచుకోవటం జరిగింది. వారు అభిమానంతో అవి అంతర్జాలంలో పంచుకోవటం జరుగుతోంది, కానీ వాటికి అనేక లింకులు ఏర్పడి అసలు సూత్రధారుడెవరో తెలియకుండా పోతోంది. ఏది ఏమైనా ఈనాడు ఒక రచయిత భౌతికంగా మనమధ్య లేకపోయినా తిరిగి వారి స్వరం వినగలుగుతున్నామంటే ఆ రచయిత కుటుంబసభ్యులకు, అభిమానులకు కలిగే ఆనందం వేరు. ఆ స్వరాలు అన్నీ కూడా ఈ “తెలుగు రచయిత” వెబ్సైట్ లో ప్రతిధ్వనిస్తే ఎవరికైనా ఆనందంగా వుంటుంది.

పుస్తక ప్రదర్శనలలో కొంతమంది కేటలాగులు ఇస్తూవుంటే మనం వాటికి అక్కడే మంగళం పాడేస్తూవుంటాము. ఆ రోజుల్లో వావిళ్ల వారు కేటలాగులు కూడా ప్రచురిస్తూ వుండేవారు. వాటిల్లో కొన్ని వివరాలు దొరికే అవకాశం వుంటుంది. 


ఈ బ్లాగులో పాత విషయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం జరుగుతోంది. ఈ క్రమంలో అనేక ఫోటోలు, పాటలు, సాహిత్యం, ఆకాశవాణి వారి ప్రసారాల రికార్డులు ఇక్కడ పొందుపరచటం జరుగుతోంది.

ఈ క్రమంలో ఈ కింద పేర్కొన్న రచయితల స్వరాలు కొన్ని Internet Archive లో పెట్టటం జరిగింది. ఇవి ఈ  లింకులో లభిస్తున్నాయి. ఇవన్నీ ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో ఒకరికి ఉపయోగపడకపోతాయాని రికార్డు చెయ్యటం జరిగింది. వీటిని “తెలుగు రచయిత” వెబ్సైట్లో పెట్టుకోటానికి ఎటువంటి అభ్యంతరం లేదు. క్రెడిట్ అంతాకూడా ఆకాశవాణి వారికే చెందుతుంది. 

బ్లాగులో “‘సజీవ స్వరాలు’” అన్న శీర్షిక కింద, ఇతర శీర్షికల కింద వినబడే కొంతమంది రచయితల స్వరాలు. 

ఆరుద్ర, అద్దేపల్లి రామమోహనరావు, పెనుమర్తి విశ్వనాధ శాస్త్రి (అజంత), బి. ఎన్. శాస్త్రి, బెజవాడ గోపాలరెడ్డి, భద్రిరాజు కృష్ణమూర్తి, బోయి భీమన్న, బూదరాజు రాధాకృష్ణ, బిరుదరాజు రామరాజు, చేకూరి రామారావు, డి. వి. నరసరాజు, దాశరధి కృష్ణమాచార్యులు, దేవులపల్లి రామానుజరావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి (1954 నాటి రికార్డు), ఏల్చూరి సుబ్రహ్మణ్యం, జి. కృష్ణ (పాత్రికేయులు), గడియారం రామకృష్ణ శర్మ, గుంటూరు శేషేంద్ర శర్మ, ఇంటూరి వెంకటేశ్వరరావు, జానుమద్ది హనుమత్ శాస్త్రి, జంధ్యాల (దర్శకుడు), కాళోజి నారాయణరావు, కొండవీటి వేంకటకవి, కొప్పవరపు సుబ్బారావు, కొర్రపాటి గంగాధరరావు, మామిడిపూడి వెంకటరంగయ్య, నండూరి రామకృష్ణమాచార్య, నటరాజ రామకృష్ణ, నాయని కృష్ణకుమారి, పోలాప్రగడ సత్యన్నారాయణ మూర్తి, పుట్టపర్తి నారాయణాచార్యులు, రావూరి భరద్వాజ, రాయప్రోలు సుబ్బారావు, రోణంకి అప్పలస్వామి, శ్రీశ్రీ, కాటూరి వెంకటేశ్వరరావు, విశ్వనాధ సత్యన్నారాయణ, సామల సదాశివ, తాపి ధర్మారావు, తిరుమల రామచంద్ర, తురగా జానకీరాణి, వానమామలై వరదాచార్యులు, వాసిరెడ్డి సీతాదేవి, బాలాంత్రపు రజనీకాంతరావు, ప్రయాగ రామకృష్ణ, వేదగిరి రాంబాబు, వి.ఎ.కె. రంగారావు, కె.కె. రంగనాధాచార్యులు మొదలగువారు 

మరి వారు అందరి సహకారం కోరుతున్నారు. మరి మన తెలుగు వాళ్ళం అందరం ఏదో ఒక రూపంలో సహకరిస్తే బావుంటుంది.

Tags: Telugu Rachayitha, Telugu Rachayithalu, Andhra Rachayithalu,
 


3 comments:

  1. మీ బ్లాగు పోస్టు మాలో మరింత ఉత్సాహాన్ని నింపింది. మీ సహాయ సహకారాలకు సదా కృతజ్ఞులం.
    మీ సూచనలు, సలహాలు తప్పక పాటిస్తాం. సైటు నిర్మాణం అంచెలంచెలుగా జరుగుతూంది. ఆర్థిక వనరులను బట్టి ఫీచర్లు నెమ్మదిగా చేర్చే ప్రయత్నం చేస్తున్నాం.
    రచయితలందరినీ తగిన సహాయ సహకారాలు అందజేయవలసిందిగా కోరుతున్నాం.
    సంప్రదించవలసిన ఈ-మెయిల్ - telugurachayita@gmail.com
    -ధన్యవాదాలతో
    తెలుగు రచయిత కార్యవర్గం

    ReplyDelete
  2. పాత బంగారం అని ఒక వెబ్ site ఉండేది. అందులో చాలా పాత పాటలు ఓల్డ్ గ్రాం ఫోన్ రికార్డులు అవి చాలా మంది పోస్ట్ చేశారు. అది నిజంగా పాత బంగారమే. అందులో చాలా విషయం ప్రోగుపదింతరువాత హఠాత్తుగా ఒక శుభముహూర్తాన మూసి వేయబడింది. తెలుగు ఆడియో పోస్టింగ్స్, రచనలు చాలా మంచి విషయాలుండేవి. ఆ paatabangaram మళ్ళీ ఏదైనా రూపంలో బయటకొస్తుందేమోనని చూస్తున్నాను. శోభనాచల మంచి సమాచారం ఇస్తోంది. వారికి నా ధన్యవాదాలు.

    ReplyDelete
  3. స‌హస్రబ్ది దార్శనిక కవి
    కవిర్విశ్వో మహాతేజా
    గుంటూరు శేషేంద్ర శర్మ
    Visionary Poet of the Millennium
    http://seshendrasharma.weebly.com/

    జననం 1927 అక్టోబరు 20 నాగరాజపాడు, నెల్లూరుజిల్లా

    మరణం 2007 మే 30 (వయసు 79) హైదరాబాదు

    తండ్రి సుబ్రహ్మణ్య శర్మ
    తల్లి అమ్మాయమ్మ
    భార్య / జానకి
    పిల్లలు

    విద్యాభ్యాసం

    ఉద్యోగం: వసుంధర; రేవతి (కూతుర్లు);
    వనమాలి; సాత్యకి (కొడుకులు)
    బి.ఏ (ఏ.సి. కాలేజ్ , గుంటూరు ,)
    లా (బి .ఎల్ , మద్రాస్ లా కాలేజ్ , మద్రాస్ )
    డిప్యూటీ మునిసిపల్ కమిషనర్
    (మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్,
    ఆంధ్రప్రదేశ్ (37 సంవత్సరాలు)


    ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ……….
    – ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
    (21 ఆగస్టు, 2000)

    * * *

    పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు.
    భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు,
    కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు.
    గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ.
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోమున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.
    నాదేశం – నాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు.
    కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు.
    ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.
    సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు,
    వచన కవిత్వం, పద్య రచన – రెండిరటి సమాన ప్రతిభావంతులు,
    ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.
    వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు.
    బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.
    ఒకానొకశైలీనిర్మాత.
    యువ నుంచి యువ దాకా కవితా సంకలనం)
    అ.జో. – వి. భొ. ప్రచురణలు 1999

    ------------
    ఆంధ్ర భువిని అత్యున్నతంబైనయట్టి
    శిఖరముల నిల్చి ఇరువు రర్చింపబడెడి _
    ఏడు కొండలన్ " శ్రీవేంకటేశు " డొకడు !
    సాహితీ గిరిన్ " శేషేంద్ర శర్మ " యొకడు !!
    - డా.ఆచార్య ఫణీంద్ర
    -------------
    కత్తులుగా మొలిచిన శేషేంద్ర మాటలు మానవత్వం పరిమళించే తోటలై,
    యువశక్తిని నవయుగం వైపుకు నడిపించే బాటలై,
    సారస్వత విలువలను సంరక్షించే దుర్భేద్యమైన కోటలై
    ఈ శతాబ్ది చైతన్య స్రవంతిలో అంతర్లీనమయ్యాయి.
    ఇదీ శేషేంద్ర సంకల్పం.
    ఇదీ శేషేంద్ర స్వామ్యవాద సాహిత్య శిల్పం………”
    -----
    అక్టోబర్ తర్వాత విప్లవంతో పెనవేసుకున్న మరో నెల మే . అదే మే డే ! కాకతాళీయంగా శేషేంద్ర నిర్యాణం మే నెలలోనే.
    అలా జనన మరణాలను అనూహ్యంగా
    విప్లవంతో అనుసంధానం చేసుకున్న కాలజ్ఞులు శేషేంద్ర..
    - -- డా.వెనిగళ్ళ రాంబాబు
    - సినీ గీత రచయిత
    -
    -------------
    అధునిక వాగనుశాసనుడు శేషేంద్ర
    “గుంటూరు శేషేంద్ర శర్మ నా దేశం నా ప్రజలు (1975) ఆధునిక ఇతిహాసంగా చెప్పబడింది. అభివ్యక్తిలో, ఆలంకారికతలో, వస్తు విన్యాసంలో కవి తనదైన వ్యక్తిత్వాన్ని ముద్రించుకున్నాడు. విప్ణవభాషా విధాతగా పేరుగన్నాడు. ఈయన కవిసేన మేనిఫెస్టో (1977) పేరుతో ఆధునిక కావ్యశా!స్తాన్ని కూడా రచించి నేటి యువతరాన్ని ఆకర్షిస్తున్నాడు. పద్యాల్గో వచన కవితా ప్రక్రియలో కావ్యాలనేకంగా రచిస్తూ సమకాలిక కవితారంగంలో శిఖరాయమానంగా వెలుగుతున్నాడు. కొంగ్రొత్త (ప్రయోగాలతో కావ్యభాషా స్వరూపంలో మార్చుతెస్తున్న ఆధునిక వాగనుశాసనుడు శేషేంద్ర.”
    ఆచార్య పేర్వారం జగన్నాథం
    సంపాదకుడు
    అభ్యుదయ కవిత్వ్యానంతర ధోరణులు,
    (ప్రచురణ 1987)
    మాజీ వైస్ ఛాన్సలర్,
    తెలుగు యూనివర్సిటీ)
    Visionary Poet of the Millennium
    seshendrasharma.weebly.com

    ReplyDelete