Saturday, July 30, 2016

1933నాటి బెజవాడ కృష్ణాపుష్కర విశేషాలు

పుష్కరకాలంఅని 2016 నుండి పన్నెండువత్సరాల చొప్పున వెనక్కిపోతే 1932లో వచ్చి వుంటాయిలే అనుకున్న పుష్కరాలు అధికమాసాల మూలంగా కాబోలు 1933లో వచ్చాయి, మళ్ళీ నదిలో పుష్కరుడు ఏరోజు ప్రవేశించాడు అన్నదాంట్లో మీమాంశ, కాటన్ మహాశయుడు కట్టిన ఆనకట్టేగాని ప్రకాశంబరాజ్ లేనిరోజులు, అసలే ఆఏడు కృష్ణానదికి వరదలు వచ్చి జనాలకు ఇక్కట్లు, దానికి తోడు పుష్కరకాలంలో గ్రహణం కూడా వస్తోంది, ఒకే దెబ్బకు రెండు పిట్టలు, డబల్ ధమాకా రెండింతల పుణ్యం, మారైల్లో ప్రయాణించి పుష్కరస్నానంతో పాటు గ్రహణస్నానం కూడా చేసి పుణ్యం మూటకట్టుకోండనీ రైల్వే వారి ప్రకటన, టాకీ సినిమాలు కొత్తగా వచ్చినరోజులు, రోజుకు నాలుగుఆటలు నాలుగుసినిమాలు అంటూ దుర్గాకాళామందిరంవారి ఆహ్వానం, పుష్కరాలు సజావుగా జరిగాయని యాత్రికుడి రూపంలో వచ్చిన విలేఖరి కితాబు, వెరసి కృష్ణా పుష్కర సంరంభం. 



































గోదావరి పుష్కరాలకు తీసుకువచ్చినట్లు కృష్ణా పుష్కరాలకు కూడా ఈనాడు వారు ప్రత్యేక సంచికను తీసుకు వచ్చారు. ఇలాంటి ప్రత్యేక సంచికలు వచ్చినప్పుడు సేకరించి పెట్టుకోవాలి. 







కొసమెరుపు: డబ్బు విలువ 1932 నాటి ప్రకటన.





Tags: Krishna Pushkaraalu, Krishna Pushkarams 2016, 1933, Vijayawada old photos,

No comments:

Post a Comment