ధనుర్మాసంలో వినవచ్చే “తిరుప్పావై – సప్తపది” రేడియో ప్రసారంలో శ్రీరంగం గోపాలత్నం గారు పాడిన తెలుగు పద్యాలను రచించినది ఎవరు అన్నది తెలియరాలేదు. తిరుప్పావై పుస్తకాలు చాలా చూసినా ఆ పద్యాలు మటుకు దొరకలేదు. చివరకు టి. టి. డి. వారి సప్తగిరి 1987 నాటి మాసపత్రికలలో రాసిన వారి వివరాలు, ఆ పద్యాల సాహిత్యం, వాటి తాలూకు చక్కటి చిత్రాలు
లభించాయి. ఈ పద్యాలలో మొదటి పది పద్యాలు శ్రీనివాస గురుడు అనే ఆయన , చివరి ఇరవై
పద్యాలు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు
తెనిగించినట్లు తెలుస్తోంది. అయితే 5,6,25,26,27,28,29,30 పాశురములకు సాహిత్యం, 29,30 పాశురములకు చిత్రాలు లభించలేదు. శ్రీరంగం గోపాలత్నం గారు పాడిన 1,2,3,4 పాశురములకు సంబంధించిన పద్యాలు వింటూ ఆ వివరాలేమిటో చూద్దాము.
ఈ తిరుప్పావై – సప్తపది
ఆడియో సి.డి.లు ఆకాశవాణి వారి వద్ద లభిస్తాయి.
Tags: Thiruppavai, Sapthapadi, Srirangam Gopalarathnam,
The above literary work and rendition are worth their weight in gold. Thank you for sharing
ReplyDeleteసార్,మీరు చేస్తున్న కృషి అపూర్వం.శ్రీమతి శ్రీరంగం వారి తెలుగు మీరా భజనలు మాకోసం సంపాదించి పోస్ట్ చేయగలరని విన్నపం
ReplyDeleteThank you so much 🙏🙏
ReplyDeleteమీ కృషి కి ధన్యవాదాలు,ఇంత మంచి విషయాలు సేకరించి పెడుతున్నారు.ఈ తిరుప్పావై సప్తపది పుస్తకం తిరుపతి తిరుమల దేవస్థానం వారు ప్రింట్ చేసారు.మీకు ఈ మెయిల్ చేయమంటారా..
ReplyDelete25-30 దాకా సాహిత్యం పంచుకోగలరా అండీ. అనేకానేకధన్యవాదాలు.
ReplyDelete