Thursday, January 17, 2013

1928 నాటి 34 మంది కవుల అరుదైన ఫోటోలు

ఒక్కోసారి పేరెన్నికగన్న కవుల, రచయితల ఫోటోలు కావాలంటే మనకు దొరకవు. ఈ కింద స్కానింగ్ చేసి పెట్టిన ఆరు పేజీలలో 34 మంది ఫోటోలు ఉన్నాయి. బాగా తెలిసిన ఒక ఆరు మంది ఫోటోలు పక్కన పెడితే మిగతా వారి ఫోటోలు మనం చూసి ఉండకపోవచ్చు. ఇంతకీ ఈ ఫోటోలు ఎక్కడివన్న విషయానికి వస్తే, 1928లో దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు గారి (ఆంధ్ర పత్రిక) కుమార్తె కామాక్షి గారికి శివలెంక శంభు ప్రసాద్ గారికి జరిగిన వివాహమహోత్సవ సమయమున వధూవరులకు దాదాపు ఒక 80 మంది కవి పండితులు సమర్పించిన పద్యమాలికలను “కామాక్షి కళ్యాణము” అను పేరిట ఒక పుస్తకంగా ప్రచురించారు. ఆ పుస్తకం చివర్లో ఈ ఫోటోలు కూడా ప్రచురించారు. దీంట్లో మీ తాత ముత్తాతలు, బంధువులు, తెలిసినవారెవరన్నా ఉన్నారేమో ఒకసారి తొంగిచూడండి. 






కొసమెరుపు 
1928నాటి బెజవాడ దుర్గా కళామందిరం ఫోటో చూడండి.

2 comments:

  1. రమణ గారు,
    వీటిని అప్లోడ్ చేసి మంచి పని చేసినారు. ఇవి ఇంక అంతర్జాలంలో భద్రంగా ఉంటాయనుకుంటాను.
    ఇద్దరి పేర్లు మాత్రము లేవు కదండీ.

    ReplyDelete
  2. వారి పేర్లు శేషాద్రి రమణ కవులు. ఫోటోమీదనే కింద కనబడి కనబడకుండా రాసివుంది

    ReplyDelete