మొక్కపాటి అనగానే మనకు పార్వతీశం గుర్తుకు వస్తాడు. మొక్కపాటి వారి ఇతర రచనల గురించి మనకు అంతగా సమాచారం లభించదు. అవి ప్రస్తుతం ప్రచురణలో లేవు. 1970లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో పార్వతీశం మొదటిభాగం ప్రచురితమవుతున్నపుడు మొక్కపాటి వారి ఇతర రచనలు కొన్ని పేర్కొనటం జరిగింది.
మొక్కపాటి వారి
రచనలలోని “గాజుపాలెం గాంధి” కధానిక స్కానింగ్ కింద చూడండి. ఈ కధ
1951లో ప్రచురితమైన మొక్కపాటి వారి “కన్నవి : విన్నవి” కధల పుస్తకం మొదటిభాగం లోనిది.