కుంతీ విలాపము, పుష్ప విలాపము వినని తెలుగు వాళ్ళు చాలా అరుదుగా ఉండవచ్చు. ఈ రెండు విలాపముల గురించే చాలా మంది ప్రస్తావిస్తారు గాని వాటితో సరి సమానమైన మరో విలాపము అదే “గోఘోష”, “గోవు విలాపము” అంతగా వినబడదు. ఘంటసాల గారి ప్రైవేట్ సాంగ్స్ కలెక్ట్ చేసినవాళ్ళకు తెలిసేవుంటుంది. అది ఇవాళ విందాము. వెనుకటికి నాగయ్యగారు గృహాలక్ష్మి సినిమాలో “కల్లు మానండోయ్ బాబు” అని పాడితే కొంతమంది కల్లు తాగటం మానారుట, అలాగే పుష్ప విలాపం విన్నాక కొంతమంది ఆడవారు పువ్వులు పెట్టుకోవటం మానారుట అని చదివినట్లు గుర్తు. మరి ఈ గోవు విలాపం విన్నాక పాలు తాగటం మానారా అన్న విషయం తెలియదు. ఈ గేయ రచయిత సి. హెచ్. సుబ్బారావు గారు.
ఎప్పుడూ వినని ఈ పద్యాల గురించి వ్రాసి వినిపించినందుకు ధన్యవాదాలు.వీటి రచయిత కూడా 'కరుణశ్రీ 'గారేనా, వేరేవా రేనా తెలపండి.ఘంటసాలగారు జాషువా గారి కొన్ని పద్యాలనికూడా గానంచేస్తూ రికార్డు ఇచ్చారట.అందుబాటులోఉంటే వాటిని కూడా వినిపించకోరుతున్నాను.
ఈ గోవు విలాపము రచయిత సి. హెచ్. సుబ్బారావు గారు. ఘంటసాల గారు పాడిన జాషువా గారి “శిశువు” పద్యాలు ఏప్రిల్ నెలలో పోస్ట్ చెయ్యటం జరిగింది. ఈ లింకు ద్వారా చూడండి. http://sobhanaachala.blogspot.in/2013/04/blog-post.html
ReplyDeleteఅద్భుతం...............మాటలు రావడంలేదు ...........నిజంగా గోమాత శోకించునట్టున్నాది........
ReplyDelete