గోలకొండ పత్రిక అనంగాన్లే మనకు గుర్తుకు వచ్చేది suravaram pratap reddy సురవరం వారు. ఆకాశవాణి వారు సజీవ స్వరాలు కార్యక్రమంలో సురవరం వారిపై 1974లో రికార్డు చేసిన ఒక సంచికా కార్యక్రమం ప్రసారం చేశారు. సమయాభావం వల్ల పూర్తిగా ప్రసారం చేయలేదు. ఇందులో పాల్గొన్న వక్తలు దేవులపల్లి వెంకట రామానుజరావు గారు, రావి నారాయణ రెడ్డి గారు, ఎన్. నరోత్తమ రెడ్డి గారు, గడియారం రామకృష్ణ శర్మ గారు. అలనాటి విశేషాలను తెలియబరిచే ఈ చక్కటి కార్యక్రమాన్ని వినండి.
పైన ప్రసంగంలో సురవరం వారి “హిందువుల
పండుగలు” అనే గ్రంధం గురించి ప్రస్తావించటం జరిగింది. 1953లో పునః
ముద్రించిన ఈ పుస్తకంలో ప్రచురించిన సురవరం వారి పీఠిక చూడండి. ఆ పుస్తక విశేషాలు కొన్ని
విశదమవుతాయి.
అలాగే “రామాయణ
విశేషములు” గ్రంధం గురించి గూడా ప్రస్తావించటం జరిగింది.
కొన్ని వ్యాసములు “విభూతి” మాస పత్రికలో
ప్రచురితమయినవి అన్నారు. ప్రెస్ అకాడమీ వారి వెబ్ సైట్లో వెదికి చూస్తే కేవలం 16
పేజీలు లభ్యమయినాయి. చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అంతర్జాలంలో వెతికితే 337 పేజీల పుస్తకం దొరికింది. ఈ కింది లింకు
ద్వారా ఆసక్తి వున్నవారు మీకు కావలసిన ఫార్మాటులో డౌన్లోడ్ చేసుకోండీ. పిడిఎఫ్
ఉత్తమం. వెబ్ సైట్ ఓపెన్ అయ్యాక ఎడమ చేతి వైపు కావలసిన ఫార్మాటు మీద రైట్ క్లిక్ నొక్కి, సేవ్ లింక్
యాజ్ అని నొక్కి ఫైల్ను సేవ్ చేసుకోండీ. ఆ పుస్తకంలోని విషయసూచిక కింద చూడండి.
1943 గోలకొండ పత్రికలో సురవరం
వారి వ్యాసం ఒకటి ప్రచురితమైనది. అందులో అక్బర్ చక్రవర్తి గారి విదూషకుడైన బీర్బల్
తెలుగు వాడని ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు. ఆ వ్యాసాన్ని కింద పోస్ట్ చేస్తున్నాను.
No comments:
Post a Comment