Saturday, July 5, 2014

1876 నాటి ధాతు నామ సంవత్సర కఱవు కధ

కఱవు కాటకాల ప్రస్తావన వచ్చినప్పుడు ధాతు నామ సంవత్సరంలో పెద్ద కఱవు వచ్చిందట అని అంటారుగాని, ఆ వివరాలుగానీ, ఆనాటి పరిస్థితుల గురించిగాని, వాళ్ళు పడ్డ కష్టాల గురించిగాని మనకు తెలియదు. ఈ విషయమై ఆంగ్లంలో చాలా సమాచారం లభిస్తోంది గాని తెలుగులో ఉన్నట్లు కనబడదు. అయితే దాదాపు 77ఏళ్ల కిందట ఆంధ్రభూమి సంచికలో ఈ కఱవు గురించి ఒక కధ ప్రచురించారు. ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో ఆ వివరాలు చూద్దాము. 

చదివినప్పుడు ఆనాటి పరిస్థితులు మన ఊహకు అందకపోవచ్చు, కానీ లభిస్తున్న కొన్ని ఫోటోలు చూస్తేగనక అవి హృదయాన్ని కలచివేస్తాయి. ఆంగ్లేయుల నిర్లక్ష్యం కూడా దీనికి కారణమంటారు. ఎక్కడో ఆఫ్రికాలో ఇలాంటివి చూస్తూవుంటాము కానీ మన దక్షిణ భారతదేశంలో ప్రజలు ఒకప్పుడు ఇలాంటి కష్టాలు పడ్డారనటం ఊహకందని విషయం. ఏనుగుల వీరాస్వామయ్య గారి “కాశీయాత్రా చరిత్ర” పూర్వాపరాల్లో 1830 ప్రాంతాల్లో కఱవు వచ్చినప్పుడు ‘గంజి దొడ్ల” ఏర్పాటు ప్రస్తావన వస్తుంది. 1980 ప్రాంతాల్లో మద్రాసులో విపరీతమైన నీటి ఎద్దడి వస్తే రాజమండ్రి నుండి రైల్వే వారు   ట్యాంకర్లద్వారా నీటిని సరఫరా చేసిన విషయం, ఆ తరువాత రామారావుగారి తెలుగుగంగ పధకం మనం ఎరిగినదే. 
 







          హిందూ సౌజన్యంతో

           హిందూ సౌజన్యంతో

మరికొన్ని ఫోటోలు ఈ కింది లింకు ద్వారా చూడండి













Tags: south India Famine 1876-1878, Madras famine, Andhra Famine, Dhathu nama samvatsara karuvu,



7 comments:

  1. ఇప్పటికీ కరువు గురించి మాట్లాడుకునేప్పుడు "ధాత కరువు" అని వింటూ ఉంటాము. అంటే ధాత నామ సంవత్సరంలో వచ్చిన కరువు భాష లోకి ఒక వాడుకగా వచ్చింది. తరువాత అప్పట్లో, అంతటి కరువులోనూ పెరుగు బాగా దొరికేదట. మరేమీ తినటానికి లేక, నల్ల మట్టిలో అంటే రేగడి మట్టిలో ఆ పెరుగు కలుపుకుని తినేవాళ్ళట అని మా అమ్మమ గారి అమ్మమ్మ చెప్పినట్టుగా మా అమ్మ చెప్పినది గుర్తుకు వచ్చి ఇక్కడ వ్రాస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. నిజమే.... చిన్నప్పుడు మా నాన్నగారు కూడా మీరు చెప్పిన మాటలే మాకు చెప్పారు.

      Delete
    2. మా నాన్నగారు కూడా చెప్పారు... అప్పట్లో రేగడిమట్టిలో పెరుగు కలుపుకుని తినేవారని.తినేదానికి గడ్డి కూడా పశువులకు లేక అవి చచ్చి పోతుంటే...పెరుగు ఎలా దొరికిందనే విషయం నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు.

      Delete
  2. శివరామప్రసాద్ గారికి నమస్కారములు. మీ పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మాతో పంచుకోవటం సంతోషం.

    ReplyDelete
  3. Dear Venkata Ramana Gaaru, please mention the year and date of the publication of this article. I am citing this in my PhD thesis but struck up with publication details. Please provide the details.

    ReplyDelete
    Replies
    1. Dear Chandu garu this article was published in April 1936 Andhra Bhoomi monthly issue

      Delete
  4. మంచి సమాచారం ఇచ్చారు...!👌

    ReplyDelete