ఈ మధ్య మా ఊరు వెళ్ళినపుడు నేను, నా సన్నిహితుడు “మాలోకం” అలా మామిడి తోటలోకి వెళితే అక్కడ ఒక మామిడి చెట్టుమీద కూచోని ఒక కోయిల తీరుబడిగా రాగాలు తీస్తోంది. మా మాలోకానికి పక్షుల భాష వచ్చులేండి. వీడు కూడా కూ .........కూ ...... అంటూ దాంతో రాగం కలిపి చాలా విషయాలు సేకరించి, నాకు చెప్పినవి యధాతధంగా ఇక్కడ పొందు పరుస్తున్నాను. ఇందులో నా ప్రమేయమేమి లేదు ఏదో నాలుగు పాటలు వాళ్ళు అడిగితే వినిపించటం తప్ప.
వికిపీడియా నుండి
|
మాలోకం
|
ఏమే.... ఓ కోయిలా........ ఏమో... పాడెదవు
|
కోయిల
|
పాడటానికి ఏమున్నది, ఏదో ఈ వసంతకాలం నాలుగు రోజులేకదా
మా గొంతు విచ్చుకొనేది, ఏదో ఉబుసుపోక కూనిరాగాలు తీస్తున్నాను |
మాలోకం
|
అవును లేత మామిడి చిగురులు తింటే కానీ మీ గొంతు
విచ్చుకోదా?
వెనుకటికి మా దేవులపల్లి వారికి కూడా ఇదే సందేహం వచ్చి “మావి చిగురు తినగానే కోయిల కూసేనా, కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా” అంటూ ఒక పాట వ్రాసారు. |
కోయిల
|
అదేంలేదు. ఇవన్నీ మీ కవుల కల్పనలు. తినదలుచుకుంటే ఏడాది
పొడుగునా ఎక్కడో అక్కడ మావి చిగురు దొరకదా ఏమిటి
|
మాలోకం
|
మరి
|
కోయిల
|
వసంతుడు వస్తే గాని మా గొంతు కుదుటపడదు.
|
మాలోకం
|
మిగతా కాలాలలో మీ గొంతు మూగబోతుందా?
|
కోయిల
|
మూగబోదు కానీ, మా గొంతు మారి పోవటంతో మీరు గుర్తు
పట్టలేరు
|
మాలోకం
|
అవును, మేము గూడా కూ....... అంటూ
ప్రత్యుత్తరమిస్తే మీ కెందుకంత ఉక్రోషం?
|
కోయిల
|
కాక పోతేమరి, గార్ధభ స్వరాలేసుకొని మీరు ఎదురు బడితే
నేను ఊరుకుంటానా, ఎప్పుడు నాదే పైచేయిగా ఉండాలి.
|
మాలోకం
|
ఈ మధ్య మీ కోయిలలు పల్లెలను వదిలి పట్నాలకు
పోతున్నారెందుకు?
|
కోయిల
|
అవును మరి ఇక్కడ పల్లెల్లో మేం గొంతు ఎత్తంగానే దార్నే
పోయే ప్రతి పిల్ల
కొక్కిరాయిగాడు మాతో గొంతు కలిపేవాడే. వాడితో పోటీపడటానికి మా వేగం పెంచే సరికి గొంతు జీరబోయి నొప్పెడుతోంది. ఏమాట కామేటే చెప్పుకోవాలి, పట్నాల్లో పిల్లలకు తగని సిగ్గు బాబు. ఇంట్లో కూసుకోవల్సిందేగాని బయటకు వచ్చి హాయిగా మాతో బాటుగా పోటీపడి కూయలేరుగదా. అందుకే అక్కడయితే హాయిహాయిగా కూసుకోవచ్చని పోతున్నారు. |
మాలోకం
|
సరే బానేవుంది, మీరు కూస్తుంటే మీతో పోటీకి వేరే కోయిలలు
కూయవెందుకని?
|
కోయిల
|
మీలో ఎవరన్నా పాడుతుంటే మీరు ఎదురుబడి పాడతారా, అది
అవమానం కాదా?
|
మాలోకం
|
నాకోటి తెలియకడుగుతాను కాకికి నీకు చుట్టరికం ఏదన్నా ఉందా? మేనమామ వరస అని విన్నాను.
|
కోయిల
|
ఏమిటి అయ్యేది ఎత్తి కుదేస్తే రెండు చెక్కలు, ఆ ఒంటి
కంటి సోమలింగానికి మాకు పోలికెక్కడ, మా అంతస్తేమిటి దాని
అంతస్తేమిటి.
|
మాలోకం
|
అంత కోపమెందుకులే, ఏదో నీకు పిల్లల్ని పెంచటం రాదని, కాకి పెంచుతుందని ఎవరో అంటేను.
|
కోయిల
|
ఎవరా అన్నది, ఆ మాట కొస్తే మీ వాళ్లే పిల్లల్ని కనటం, పెంచటం చేతకాక వేరేవాళ్లను ఆశ్రయిస్తున్నారు.
|
మాలోకం
|
అలా అని కాదు, నీ గుడ్లను కాకి గూటిలో ఉంచుతావని
వింటేను
|
కోయిల
|
అవును మరి మా కుల పెద్దలు అలా చెప్పారు, అదే
ఆచరిస్తున్నాము
|
మాలోకం
|
కారణంబేమిటాయని
|
కోయిల
|
అప్పట్లో మేమే గుడ్లను ఎంతకాలం పొదిగినాగాని బిడ్డలు
బయటికి రాక చనిపోతుంటేను ఎవరో మహర్షి మా పెద్దలకు సలహాయిచ్చారుట కాకి గూట్లో గుడ్లను
ఉంచమని. పెద్దలమాట పాటించటం తప్పంటారా
|
మాలోకం
|
అంతమాట ఎవరన్నారు కానీ, కాకి ఆమాత్రం కనిపెట్టలేదాయని
|
కోయిల
|
దాని తలకాయ అది ఉత్త వెర్రిబాగుల పక్షి
|
మాలోకం
|
అంతమాట అంటావేమిటి, పక్షులన్నిటిలోకి చాలా తెలివిగల పక్షి
యని మా
పుచ్చా పూర్ణానందం గారు ఏకంగా కాకిని స్తుతిస్తూ “కాకిదాడి” అని పెద్ద వ్యాసం రాస్తేను. దాని చిలిపి చేష్టలు నీకేం తెలుసు. నా చిన్నప్పుడు నూతికాడ స్నానం చేస్తుంటే సబ్బెత్తుకుపోయి ఇంటి మీద పెట్టేది. అయినా కాకి లేకపోతే మేము చేయాల్సిన పితృకర్మలు ఆగిపోవూ. |
కోయిల
|
అది ఉత్త తెలివి తక్కువది కాబట్టే మా వంశాభివృద్ది
జరుగుతోంది.
|
మాలోకం
|
తెలుసుకోవాలని ఉందికాని, మీ గుడ్లను కాకి గూటిలోకి ఎలా
చేరుస్తారాయని
|
కోయిల
|
ఏముంది ప్రసవకాలం రాగానే, మా మగవారు కాకి గూటి దగ్గరకు
వెళ్ళి కూయంగాన్లే, ఆ పిచ్చి కాకులు మా మగవారిని తరుముతూ వెళతాయి, అవి
దూరంకాగానే మేము లటుక్కున వెళ్ళి చటుక్కున గుడ్డు పెట్టి వస్తాము. ఒక్కోసారి
వేరేచోట ఉన్న గుడ్డును ముక్కుతో పట్టుకెళ్లి పెడతాము.
|
మాలోకం
|
దానికి తెలియదామరి, మీరే దాని గుడ్డును ఒకటి కిందకు
తోసేస్తారని విన్నాము.
|
కోయిల
|
మీ వన్నీ గాలి కబుర్లే, ఒక జీవిని కడతేర్చే మనస్తత్వం
కాదు మాది మీలాగా,
కాకికి లెక్కలు రావు మరి మేమేం చేసేది. మీరే అంటారుకదా కాకి లెక్కలు అని |
మాలోకం
|
మీకు గూడు కట్టటం రాదా మరి
|
కోయిల
|
ఎవరన్నారు రాదని, కాకికే చేతగాదు,
నాలుగు పుల్లలు తెచ్చి ఆడ్డదిడ్డంగా పడేస్తుంది.
|
మాలోకం
|
ఐతే మీకు పిల్లల్ని పెంచటం చేతకాదన్నమాట
|
కోయిల
|
అందుకే కోపమొచ్చేది, ఇందాకటినుంచి చూస్తున్నాను మాకు ఏమీ
రావన్నట్లు మాట్లాడతారేమిటి, మేము గుడ్లను పొదగమనే గాని, మా పిల్లలను కంటికి రెప్పలా కనిబెడుతూ ఉంటాము.
|
మాలోకం
|
కోపమొద్దులే కానీ కాకి మాంసాహారిగదా, మీ
పిల్లలకు గూడా పెడుతుందికదా
దానివల్ల గాత్రానికేమీ ఇబ్బంది లేదాయని, మీరు చూస్తే శాఖాహారులు కదాయని |
కోయిల
|
ఏం మీలో పాటలు పాడేవారందరు శాఖాహారులేనా
|
మాలోకం
|
నువ్వు గడుసు కోయిలలాగున్నావే ప్రతిదానికి మామీద
పడుతున్నావు. సరే కానీ కాకికి ఎప్పుడు తెలుస్తుంది ఇది తన పిల్లకాదని
|
కోయిల
|
ఏముంది రెక్కలు వచ్చాక అక్షరాభ్యాసంనాడు “కా” అనమంటే మా
పిల్లకాయలు “కూ” అంటారు. దాంతో దానికి
చిర్రెత్తుకొచ్చి గూట్లోంచి
తరిమేస్తుంది. మా బిడ్డను మేము మా ఇంటికి తెచ్చుకొని విద్యా బుద్ధులు నేర్పిస్తాము.
|
మాలోకం
|
ఎక్కడో చదివాను పక్షులు ఏవి కానీ ఉఱుమును గుర్తించలేవు, కోయిల
గుర్తిస్తుందని
|
కోయిల
|
ఏమో ఎవరన్నారో, శబ్దాన్ని గుర్తించలేక ఎలావుంటాము కాకి
లాగా చెవిటి మాలోకం అయితే తప్ప
|
మాలోకం
|
అదిగో అదే నాపేరే ఎత్తావూ. నాకో సందేహం నిన్ను కోయిల
అనాలా లేక కోకిల అనాలా
|
కోయిల
|
ఏమో బాబు ఈ యికార, కికారాల గురించి నాకు తెలియదు కానీ “కూ” యని మనసారా ఎవరు పిలచినా
బదులిస్తాము
|
మాలోకం
|
నీకో విషయం తెలుసా మాలో కోయిల మీద పద్యమో, గేయమో
రాయని కవి కనిపించడు. అలా రాయలేకపోతే
కవేకాడు.
|
కోయిల
|
అవును ఎప్పుడో విన్నాను. ఎవరి కవి గారుట మా కోకిలమ్మకు
పెళ్లి చేశారని విన్నాను.
|
మాలోకం
|
ఇంకెవరనుకున్నావు మా విశ్వనాధగారే. వాళ్ళ “బాపి” బావతో బొమ్మలు
అవి వేయించి తానే మరీ దగ్గర ఉండి
పద్యాలు,
పాటలు పాడి “కోకిలమ్మ పెళ్లి” జరిపించారు. మా సినిమా వాళ్ళు మీ కోకిల గానాల మీద
లెక్కలేనన్ని పాటలు రాయించి, పాడించారు తెలుసా.
|
కోయిల
|
ఏది ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను, వారెవరో కోయిల
లాగా పాడారుట కొద్దిగా వినిపించగూడదు
|
మాలోకం
|
డానికేం భాగ్యం అసలే ఆవిడ ఆనాటి అందాల బాల కాంచనమాల. ఇక
పాటంటావా విని చూస్తే తెలుస్తుంది.
|
కోయిల
|
మొదట్లో మీరు “ఏమే.... ఓ కోయిలా........ ఏమో... పాడెదవు” అన్నారే ఇది
కూడా పాటేనా
|
మాలోకం
|
పాటేనా ఏమిటి పాటే మరి. మా కన్నాంబ గారు పాడితే కోయిలలకు
ఏంచేయ్యాలో తోచలేదుట. విని చూడు నీకే తెలుస్తుంది.
|
కోయిల
|
చాలా బావుందే, చిన్న పిల్ల
లాగా భలేగా నవ్వేరే
|
మాలోకం
|
అప్పుడే ఏమయింది ఈసారి మా భానుమతి గారు పాడతారు, విని
తరించు
|
కోయిల
|
ఎమో ఆనుకున్నాను గానకోకిలలు చాలామందే ఉన్నారే
|
మాలోకం
|
ఆ మా కొస్తే మా అసలు గానకికిల సరోజినీనాయుడు గారు. నీ కేం తెలుసు ఆ రోజుల్లో
మా చిట్టిబాబు గారు వీణ మీద కూ....... యని పలికిస్తే కోయిలలు తత్తర పడ్డాయట. అవును మీలో మగ కోయిలలు కూడా కూ........
యంటాయా?
|
కోయిల
|
ఏం మీ ఆడవారు మిమ్మల్ల్ని కూ............. యని కూడా
అననివ్వరా
|
మాలోకం
|
నీతో బలే గొడవగా ఉందే, మీలో గండుకోయిలలు,
పూలకోయిలలు అని కూడా ఉంటాయా?
|
వికిపీడియా నుండి
|
కోయిల
|
ప్రకృతి పరంగా వచ్చే మార్పులతో పూలకోయిలలు ఉండవచ్చు గాని, గండు
కోయిలలు మటుకు మీ కవుల కల్పనలే
|
మాలోకం
|
మళ్ళీ మాటల్లో పడ్డాము, ఈ సారి మరికొన్ని పాటలు విందాము
|
కోయిల
|
వినిపించండి మరి ఆలస్యమెందుకు.
|
ఈ వనిలో కోయిలనై – గుణసుందరి కధ - కమలాదేవి
రావే రావే కోకిల – బాలసరస్వతి – రాజేశ్వరరావు
ఈ మాను పై నుండి – అపవాదు – బాలసరస్వతి –రఘురామయ్య
పాడవే కోయిలా -
సుమంగళి – మాలతి
- గిరి
కల కల ఆ కోకోలేమో –గుణసుందరి కధ – మాలతి – శాంతకుమారి
కోయిలా
కూసినా – లలిత గేయం – కోమల
కొమ్మల్లో కోయిలనై – లలిత గేయం – వేదవతి ప్రభాకర్
కోయిలరో యేది నీ ప్రేమ గీతి – మళ్ళీ పెళ్లి - కాంచనమాల
మాలోకం
|
పాటలు బావున్నాయి కదూ
|
కోయిల
|
ఇక్ష్వాకుల కాలంనాటి పాటలు అన్నీ వినిపించారు. కొత్త పాటలే లేవా? ఈ పాటలతో నిద్ర
ముంచుకొస్తోంది, పొద్దు పొడుస్తోంది, గూటికి పోవాలి బాబూ అదిగో మా ఆయన
కూస్తున్నాడు, మళ్ళీ కలుద్దాము.
కూ................................
|
Tags: koyila patalu, kokila,
This comment has been removed by the author.
ReplyDeleteexcellent to see kanchanamala in balanagamma. Rarest collections brought to one point on koila. dialogues too are very interesting. I too have some songs on koila
ReplyDeletesung by my father in AIR who also acted as Balavardhiraju in the same Gemini,Balanagamma. will you please contact me 9441481014 as I don't have your phone no.
శ్రీ గారికి
Deleteమీరు గతంలో కూడా ఈ విషయం వ్రాసారు, జెమినివారి బాలనాగమ్మ లో బాలనాగమ్మ కొడుకు గా నటించిన మీ నాన్న గారు మాస్టర్ విశ్వం గారనుకుంటాను. వీరు జీవన్ముక్తి, భూకైలాస్ సినిమాలలో గూడా నటించారని చదివాను. చాలా ఏళ్ళ కిందట నెట్ లో సేకరించిన మూడు పాటలు తప్ప నా దగ్గరకూడా బాలనాగమ్మ సినిమా లేదు. దాదాపు 25 ఏళ్ళ కిందట ఢిల్లీ దూరదర్శన్ వారు ఈ సినిమా ప్రసారం చేశారు. మాయల మరాఠీ గా నటించిన గోవిందరాజుల సుబ్బారావు గారి నటన మరువలేనిది.
I have the copy of Gemini Balanagamma. AVM first Bhukailas is available in net. Chandika and Jeevanmukthi not available. If you want Gemini Balanagamma please do sms your address to mymobile 9441481014. will you pl give your mobile/land number.
Delete> గండు కోయిలలు మటుకు మీ కవుల కల్పనలే
ReplyDeleteకాదండీ. గండుకోయిల అంటే మగకోయిల అన్నమాట. అలాగే గండుతుమ్మెద అంటే మగతుమ్మెద.
ఈ టపా చాలాచాలా బాగుంది. ఈ పాటలన్నీ తీరిక చేసుకొని తప్పక వినవలసినవి.
శ్యామలీయం గారికి
Deleteనేనంటూనేవున్నా కోయిలకు తెలియకపోవచ్చు అని, అయినాగాని కోయిల చెప్పింది రాయాలని మా మాలోకం పట్టుబట్టటంతో ఈ తప్పు దొర్లింది. ఏది ఏమయినప్పటికి మీ అభిప్రాయాన్ని తెలుపుతూ మా సందేహాన్ని నివృత్తి చేసినందుకు చాలా సంతోషం.
ఎందుకోనండీ. నాకు మీ టపాలోని ఆడియోలింకులు కనిపించటం లేదు. ఊరికే హెడ్డింగులు మాత్రమే వచ్చి క్రిందన ఖాళీ స్థలం కనిపిస్తోంది. కారణం అన్వేషించాలి. ఏదైనా ఆడియోప్లేయర్ మిస్సింగ్ అనుకుంటాను.
ReplyDeleteKoyilamma to Interview Dialogues, Supporting Old Songs Excellant. Thank You so much for presenting this Musical & Literary Feast to our Ears, Eyes and Heart. Thanks for all the pains you are taking us to make the Music & Literary Lovers Happy.
ReplyDeleteWishing You All the Best.