రేడియోలో పాటలు రికార్డ్ చేసేటప్పుడు పాడిన వారి వివరాలు చాలామంది రికార్డ్ చేయరు . ఒక్కోసారి మనం రికార్డ్ చేసుకోటానికి తయారయెలోపల వివరాలు చెప్పేసి వుంటారు. ఆకాశవాణి హైద్రాబాదు కేంద్రం వారు ఉదయం సంస్కృత వార్తల అనంతరం మంచి మంచి లలిత గేయాలు 60ఏళ్ల ప్రస్థానంలో అంటూ ప్రసారం చేస్తున్నారు. కాని పాడిన వారి, రాసిన వారి వివరాలు ప్రకటించటం లేదు. సరే ఇప్పుడయితే రికార్డ్ చేయటానికి క్యాసెట్లు దొరకటం లేదు. కొన్ని టేప్ రికార్డర్లలో ఎఫ్. ఎం. ఒకటే ఉంటోంది. టేప్ రికార్డర్లు గూడా కొద్ది కాలంలో టెలిగ్రాంల జాబితాలో చేరిపోయేటట్లు ఉన్నాయి.
సరే ఇప్పుడు పాత రికార్డులనుండి “ఎందరి వలపించేనో” అనే పాట విందాము. యధా ప్రకారం పాడిన వారి వివరాలు తెలియవు. కాని పాడినది మల్లిక్ గారేమోనని అనుమానం.
గొంతు మల్లిక్ గారిదిలాగే ఉంది!ఎందరి వలపించెనో ఆకాశవాణి శ్రవ్య తరంగం శ్రావ్యంగా వీనులవిందుగా ఉంది!రమణగారికి వంద వందనాలు!
ReplyDeleteధన్యవాదములు
ReplyDeletepaata chaalaa bavundi
ReplyDeletedhanyavaadamulu