“ధనుర్మాసము” అనగానే గుర్తుకు వచ్చేది “తిరుప్పావై” ఆ వెంటనే భక్తిరంజని. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైన తిరుప్పావై మొదటి రోజు పాశురము వినండి. రోజుకు ఒక్క పాశురము చొప్పున నెల రోజుల పాటు ప్రసారం చేయటం జరుగుతుంది. మొదట వ్యాఖ్యానము, తదుపరి మొదట తమిళంలోను తరువాత తెలుగులోను చివరగా ఒక మంచి కీర్తన తోను ముగుస్తుంది. తమిళంలో ఎం. ఎల్. వసంతకుమారి గారు, తెలుగులో శ్రీరంగం గోపాలరత్నం గారు గానం చేశారు. తెలుగు రచన దేవులపల్లి వారా అన్నది తెలియదు. లభ్యమైన భాగాలు పోస్ట్ చేయటానికి ప్రయత్నిస్తాను.
Tags: thiruppavai, M L vasantha kumari, srirangam gopalarathnam, bhakthi ranjani, AIR,
అద్భుతం
ReplyDelete