దామెర్ల వారు, వరదా వారు, చామకూర వారు, బాపిరాజు గార్లు లాంటి చిత్రకార్లు వెలుగులోకి రావటానికి మూలకారణం వారి గురువు ఆస్వాల్డ్ కూల్డ్రే గారు. వారి గురువు గారి గురించి బాపిరాజు గారు రాసిన ఒక వ్యాసం “కిన్నెర” 1950 నాటి సంచికలో వచ్చింది. ఆ వ్యాసంతోపాటు వారి ఫోటోలు, చిత్రాలు చూద్దాము. ఆనాటి విశేషాలు, కూల్డ్రే గారి అభిమానం చదివితే తెలుస్తుంది.
ఈ సందర్భంగా దామెర్ల సత్యవాణి గారు (దామెర్ల వారి భార్య), బుచ్చి కృష్ణమ్మ (దామెర్ల వారి సోదరి), చామకూర సత్యన్నారాయణ (చామకూర భాష్యకార్ల రావు గారి సోదరుడు) గార్ల ఫోటోలు, చిత్రాలు కూడా చూద్దాము.
మరి ఈ సందర్భంగా స్మరించు కోవలసిన మరొక విశిష్ట వ్యక్తి వారి శిష్యుడు “ఆంధ్రా వర్డ్స్ వర్త్” శ్రీ కవికొండల వెంకటరావు గారు. కూల్డ్రే గారు రాసిన ఒక పుస్తకం గురించి ప్రస్తావిస్తూ వచ్చిన వీరి వ్యాసం కూడా చూద్దాము.
ఇవన్నీ కూడా ప్రెస్ అకాడమీ వారి వివిధ పాత సంచికల నుండి సేకరించినవే. ఎక్కడో పాత సంచికలలో, పుటల మధ్య ఇమిడిపోయిన ఈ సమాచారం ఇంటర్నెట్ సెర్చ్ ద్వారా దొరికేదికాదు. ఈ విధంగానన్నా కొన్ని వెలుగు చూస్తాయని.
భారతి (1925) చిత్రకారుడు శ్రీ దామెర్ల రామారావు గారు |
దామెర్ల వారి చిత్రాల
వివరాలు
|
Bharathi Nov 1937 |
Tags: Oswald Couldrey,
Damerla Ramarao, Varada Venkatarathnam, Adavi Bapiraju, Chamakura Bhashyakarla Rao,
chamakura sathyanarayana, Damerla Sathyavani, Buchhi Krishnamma, Kavi Kondala
Venkatarao, Andhra Wordsworth, Pattiseema, Old paintings, Bharathi, Kinnera, Rajahmundry