మనలో చాలామంది ప్రతి విషయానికి మున్ముందే స్పందించటం ఆనవాయితీ. నిత్యం జరిగే అనేక సంఘటనలమీద అంతర్జాలంలోని తమ ‘భావజాలం’లోనో లేక ఆయా వార్తాంశాలకింద వ్యాఖ్యల ద్వారానో తమతమ మనోభావాలను ప్రకటించటం, చివరకు అది వివాదాలకు, అభిప్రాయబేధాలకు తావివ్వటం చూస్తూనేవుంటాము. ఏదన్నా విషయమై పదిమందిని కదిలిస్తే పది భిన్నాభిప్రాయాలు వెలువడే రోజులివి. సరే రాజకీయాలలో ఉండేవాళ్లకు ఈ సామెత వర్తించదు, అనడం, పడటం వాళ్లకు పరిపాటి. కాని మధ్యేమార్గంగా ఈ ఉదాసీన వైఖరి అవలంబిస్తే జీవితాలు సాఫీగా వెళ్ళిపోతాయి. మరి ఈ విషయంలో మొక్కపాటి వారి ధోరణి ఏమిటో చూద్దాము.
ముందుగా “మౌనము” అనే అంశం మీద శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం గారి భావజాలం విందాము. ఆకాశవాణి వారి ‘భావన’ నుండి.
చివరిగా “వినరో భాగ్యము” అన్నమాచార్యుల వారి కీర్తన శ్రీ బాలకృష్ణప్రసాద్ గారి గళంలో. భక్తిరంజని ప్రసారం, ఇది బహుశా ఆకాశవాణి వారి రికార్డు అయివుంటుంది, అంతర్జాలంలో వినిపించే వీరు పాడిన ఇదే కీర్తనకు దీనికి స్వల్ప వ్యత్యాసం కానవస్తుంది
...
Tags: Mokkapati
Narasimha Sastry, Vinaro bhagyamu, Annamacharula keerthana, Balakrishna Prasad,
Sripathi Panditharadhyula Parvateesam, Bhakthiranjani, Bhavana, Akashavani,
Annamayya,
No comments:
Post a Comment