గతంలో సినిమాల, ఎల్.పి. రికార్డుల ప్రకటనలు ఎన్నో ఈ బ్లాగులో పోస్ట్ చెయ్యటం జరిగింది. ఈ క్రమంలో ఒకసారి ఆనాటి వాణిజ్య ప్రకటనలు తెలుగులో వచ్చినవి వెలుగులోకి తెస్తే ఎలావుంటుంది అన్న ఆలోచనకు కార్యరూపమే ఇది. కారణాలు అనేకం కావచ్చు ఈ రోజుల్లో తెలుగు సంచికలలో ప్రకటనలు ఆంగ్లంలో వస్తున్నాయి. ఈ మధ్యవరకూ దుకాణాల పేర్లు చక్కటి తెలుగులో ఉండేవి, ఇప్పుడు తాటికాయంత ఆంగ్లాక్షరాలతో రాస్తూ ఓ మూలగా తప్పదన్నట్లుగా ఆవగింజంత ఆంధ్రాక్షరాలతో రాస్తునారు అదిగూడా ఉచ్ఛారణా దోషాలతో. ఈ కింది ప్రకటనలలోనివి కొన్ని ఎనభైఏళ్ల కిందటివి. ఆ ప్రకటనలలోని వస్తువులను కొన్నిటిని ఈనాటికి మనం వాడుతున్నాము. వీటిని పోస్ట్ చెయ్యటంలో ఉద్దేశం ఆనాడు ప్రకటనలు ఎలా ఉండేవి, అందునా తెలుగులో ఎలా ప్రకటించేవారు, వాటి భాషా సౌందర్యము, తీరుతెన్నులు, ఆనాటి వస్తువుల ధరలు, ఇతరత్రా వివరాలు తెలుసుకోటానికి తప్ప వాటిని మీరు కొనాలనీ కాదు, కొంటారనీ కాదు. “సినీతారల సౌందర్య రహస్యం” ఏమిటంటే తడుముకోకుండా “లక్స్” అంటాము. మరి అరుదైన ఆ ప్రకటనలు కొన్ని చూడవచ్చు. అమృతాంజనానికి శ్రీ గరిమెళ్ళ సత్యన్నారాయణ గారు ఆంగ్లంలో రాసిన పద్యాలు చూడవచ్చు.
Tags: Old
Advertisements, Telugu advertisements, old telugu adds, Telugu prakatanalu,
ReplyDeleteఎక్కువ తాళిమి గూడన్
మక్కువ జూచెన్ జిలేబి మస్తుగ ఫోటో !
చెక్కిలి అందము లక్సున
పక్కకు వచ్చెను గదోయి పరిపరి జూడన్ :)
చాలా చాలా బావున్నాయి, ప్రకటనలు
Deleteఎంతో ఓపికతో అన్నీ ఒక చోట కూర్చి అందించినందుకు మిక్కిలి ధన్యవాదములు
ఈ సైట్ తెలుగువారికి ఒక వరం
నా విన్నపం- ఆడియో ప్రకటనలు ఏమైన ఉన్నాయా, ఉంటే అందించండి
ధన్యవాదాలు
Delete