“ఒక ఐడియా జీవితాన్ని మార్చివేస్తుంది” అన్నది ఐడియా సెల్ల్యులార్ వారి ఐడియా. సహజంగా శాస్త్రజ్ఞులు, కళాకారులు ప్రకృతి నుంచి ప్రేరణ పొందుతూ వుంటారు. న్యూటన్ సిద్ధాంతానికి మూలం మనం ఎరిగినదే. అలాగే చెట్టునుండి రాలిన ఎండుటాకులను చూసి మనస్సులో ఉద్భవించిన ఆలోచనతో, ఎండుటాకులతో విభిన్న చిత్రాలు, కళాకృతులు చేసి, దేశవిదేశాలలో ప్రదర్సనలిచ్చి, అందరి మన్ననలు పొందిన తెలుగు చిత్రకారులు శ్రీమతి ముక్తవరం వసంతకుమారి గారు. మనం కూడా చిన్నప్పుడు పచ్చిఆకులను తెచ్చి పుస్తకాల మధ్యలోపెట్టి దాన్నెత్తిన ఓ తిరగలిరాయి పెట్టి అవి ఎండాక నోటు పుస్తకాల్లో అతికించిన వైనం గుర్తుండే వుంటుంది.
Source: mvkgreenart.com |
Source: mvkgreenart.com |
వారు ఓ టి.వి. ఛానెల్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూ ఈ కింది లింకు ద్వారా చూడవచ్చు.
అలాగే వారి వెబ్సైటు, అక్కడి గ్యాలరీలోని అధ్భుత చిత్రాలు ఈ కింది లింకు ద్వారా చూడవచ్చు.
వారు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిద్దాం.
Tags: Mukthavaram Vasantha Kumari, MVKGreenArt, Green Leaf Art, Dry Leaf
Art,
బాగున్నాయండి. చాలా నైపుణ్యంతో కూడిన కళ. ఆవిడ తెలుగువారు కావడం మరింత సంతోషదాయకమయిన సంగతి.
ReplyDeleteధన్యవాదాలు
Delete