Tuesday, November 29, 2016
Saturday, November 26, 2016
శరణంభవ – తరంగం – పి. సూరిబాబు గారి గళంలో
పాశుపతాస్త్రము 1939 సినిమాలో పి. సూరిబాబు గారు గానంచేసిన “శరణంభవ కరుణామయి” – శ్రీ నారాయణ తీర్ధుల వారి తరంగం విందాము – సంగీతం వి. జె. గోపాల్ సింగ్. ఇది నారద పాత్రధారి గానం చేసినట్లుగా పాటల పుస్తకాన్ని బట్టి సమాచారం. అనురాగం సినిమాలో భానుమతి గారు కూడా ఇదే తరంగం పాడిన విషయం తెలిసేవుంటుంది.
Tags: P. Suribabu, Saranambhava, 1939
Wednesday, November 23, 2016
బాలమురళీకృష్ణ గారి అమృతగానలహరి
శ్రీ బాలమురళీకృష్ణ గారు గానం చేసిన కొన్ని పాటలు, గేయాలు విందాము. వీటిల్లో చాలావరకు గతంలో పోస్ట్ చేసినవే. అయితే వారి కీర్తనలు అందరూ ఎప్పుడూ వింటూనే వుంటారు కాబట్టి, కొంచెం విభిన్నంగా పద్యాలు, అష్టపదులు, పాటలు, గేయాలు, భజన కీర్తనలు ఒకచోటికి తేవటం జరిగింది. వారిని ఈవిధంగానన్నా మరొకమారు స్మరించుకుందాము.
![]() |
|
గురుదేవులు – శ్రీ పారుపల్లి
రామకృష్ణయ్య పంతులు గారు
|
ఇప్పుడు ఒక లలిత గేయం – ఆకాసమున చిరుమబ్బుల చాటున – బసవరాజు అప్పారావు గారి రచన – ఆకాశవాణి వారి రికార్డు
ఇప్పుడు ఒక యుగళ గీతం శ్రీరంగం గోపాలరత్నం గారితో కలిసి – మన ప్రేమ – రచన శ్రీ బాలాంత్రపు రాజనీకాంత రావు గారు – ఆకాశవాణి వారి ప్రసారం
మధురమైన అష్టపది – జయదేవులు - ప్రళయపయోధిజలే
ఇప్పుడు మన రాష్ట్ర గీతం – మా తెలుగు తల్లికి మల్లెపూదండ – రచన శ్రీ శంకరంబాడి సుందరాచారి
..
ఇప్పుడు ఒక ప్రబోధాత్మక గేయం విందాము – పాడుదాం ఏకమై మనతెలుగు ఖ్యాతి
సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారి కృతి ఒకటి చవిచూద్దాము – స్థిరతా నహినహీరే - ఆకాశవాణి వారి భక్తిరంజని నుండి
అలాగే పురందరదాసుల వారి కీర్తన కన్నడ రాజ్ కుమార్ గారి నవకోటి నారాయణ సినిమా కోసం – అచ్యుతానంత గోవింద ముకుంద
మరి ఒక సుప్రభాతమ్ – భద్రాచల శ్రీరామ సుప్రభాతమ్ – ఆకాశవాణి వారి భక్తిరంజని నుండి
తిరుప్పావై ఐదవరోజు పాశురము - తమిళంలో బాలమురళి గారు – తెలుగు సప్తపది శ్రీరంగం గోపాలరత్నం గారి గళంలో - విజయవాడ ఆకాశవాణి వారి భక్తిరంజని నుండి
ఒక జానపద గేయం - అటు భక్తి ఇటు ముక్తి – వింజమూరి
సీతాదేవి గారి సంకలనం మరియు సంగీతంలో – రఘురామ రాముల సంగీతమె
ఒక భక్తి గీతం విందాము – మేలుకోవయ్య శంకర
నాగయ్య గారి కోసం భక్తరామదాసు సినిమాలో పద్యాలు
ఒక చక్కటి సినిమా పాట – ఉయ్యాల జంపాల సిసిమాకోసం – ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు, ఎదలోపలి మమకారం ఎక్కడికి పోదు
ఇప్పుడు మరొక అష్టపది – రాధికా కృష్ణా రాధికా తవవిరహే కేశవా
ఒక తత్వం – నిను విడచి ఉండలేనయా – ఇది ఆకాశవాణి వారి తత్వం
మరి చివరిగా యధాప్రకారం మంగళం – రామచంద్రాయజనక
![]() |
|
ఇది మంగళంపల్లి వారి రచన
|
Subscribe to:
Comments (Atom)














































