పాత సినిమా పాటలను కొంతమంది తేలిగ్గా తీసిపారేస్తారు. వినకుండా ఓ అభిప్రాయానికి రాకూడదు. వింటుంటేనే హత్తుకొనేవి కొన్ని. వినగా వినగా హత్తుకొనేవి కొన్ని. 1950 లో వచ్చిన శోభనాచల వారి Lakshamma లక్షమ్మ చిత్రంలో ఘంటసాల గారి సంగీత నేపధ్యంలో M S Rama Rao ఎం. ఎస్. రామారావు గారు, Krishnaveni కృష్ణవేణి గారు పాడిన ఈ పాట మన మనస్సులను ఊయెల ఊపటం ఖాయం. ఈ పాట రచన రజని Rajani గారు.
Monday, July 29, 2013
Saturday, July 27, 2013
రొదసేయకే తుమ్మెదా – రజని గీతం
balantrapu rajanikanta rao బాలాంత్రపు రాజనీకాంతరావు గారు రచించిన "rodaseyake tummeda" “రొదసేయకే తుమ్మెదా” అనే గీతం విందాము. పాడిన వారి వివరాలు తెలియవు. తెలిసిన వారు ఎవరన్నా తెలియపరిస్తే సంతోషం. టేప్ అయిపోవటంతో చివరి రెండు లైన్లు రికార్డు అవలేదు. ఈ గేయం ఎస్. వరలక్ష్మి గారి “గణగణ జయగంట” తరువాత ప్రసారం అయింది. ఆలా అని ఆవిడ పాడారని కాదు కానీ మొదటి చరణంలో ఆ ఉధృతం చూస్తుంటే ఆవిడ గొంతు కలిపారా అనిపిస్తుంది. lalitha geethalu
Friday, July 26, 2013
Thursday, July 25, 2013
Wednesday, July 24, 2013
Tuesday, July 23, 2013
Monday, July 22, 2013
Saturday, July 20, 2013
Thursday, July 18, 2013
వివాహ ప్రకరణము - దైవజ్ఞ నేమాని శ్రీరామశాస్త్రిసిద్ధాంతి గారు
ఈమధ్య ప్రెస్ అకాడమీ వారి పాత సంచికలు తిరగేస్తుంటే వివాహ ప్రకరణము అన్న విషయం మీద దైవజ్ఞ నేమాని శ్రీరామశాస్త్రిసిద్ధాంతి గారి వ్యాసం ఒకటి కనబడింది. వివాహానికి సంబంధించి వివాహ నక్షత్రములు, వారములు, తిధులు, లగ్నములు మరియు అనేక ఆసక్తికరమైన విషయముల మీద చాలా విపులంగా విశదపరచిన వ్యాసమిది. పంచాంగంలో కూడా ఇన్ని విషయాలు తెలుపకపోవచ్చు. ఆసక్తి ఉన్నవారు దాచుకోవలసిన వ్యాసమిది. నలుగురికి అందాలని పోస్ట్ చేస్తున్నాను.
Monday, July 15, 2013
ఎందరి వలపించెనో - ఆకాశవాణి శ్రవ్యతరంగం
రేడియోలో పాటలు రికార్డ్ చేసేటప్పుడు పాడిన వారి వివరాలు చాలామంది రికార్డ్ చేయరు . ఒక్కోసారి మనం రికార్డ్ చేసుకోటానికి తయారయెలోపల వివరాలు చెప్పేసి వుంటారు. ఆకాశవాణి హైద్రాబాదు కేంద్రం వారు ఉదయం సంస్కృత వార్తల అనంతరం మంచి మంచి లలిత గేయాలు 60ఏళ్ల ప్రస్థానంలో అంటూ ప్రసారం చేస్తున్నారు. కాని పాడిన వారి, రాసిన వారి వివరాలు ప్రకటించటం లేదు. సరే ఇప్పుడయితే రికార్డ్ చేయటానికి క్యాసెట్లు దొరకటం లేదు. కొన్ని టేప్ రికార్డర్లలో ఎఫ్. ఎం. ఒకటే ఉంటోంది. టేప్ రికార్డర్లు గూడా కొద్ది కాలంలో టెలిగ్రాంల జాబితాలో చేరిపోయేటట్లు ఉన్నాయి.
సరే ఇప్పుడు పాత రికార్డులనుండి “ఎందరి వలపించేనో” అనే పాట విందాము. యధా ప్రకారం పాడిన వారి వివరాలు తెలియవు. కాని పాడినది మల్లిక్ గారేమోనని అనుమానం.
Saturday, July 13, 2013
మడి ప్రహసనము – పానుగంటి – మునిమాణిక్యం
తెలుగు సాహిత్యంలో ప్రహసనములకు ప్రత్యేక స్థానం ఉంది. ఆద్యంతము హాస్యము ధ్వనించేలా సాగే ఈ రచనా ప్రక్రియలో మనకు ముగ్గురు రచయితలు కనబడతారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు, పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు, చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు. పానుగంటి వారి ప్రహసనాలు ఎప్పుడు కళ్ల జూడ లేదు. వెనుకటికి ఎవరో అన్నారు కందుకూరి వారి ప్రహసనాలలో పేరులో తప్ప ఎక్కడా నవ్వు ధ్వనించదని. చిలకమర్తి వారి ప్రహసనాలు చాలా బావుంటాయి. అందులో ముఖ్యమైనది “బధిర చతుష్టయ ప్రహసనము”. సంభాషణా రూపంలో నాటకం లాగా కనబడుతుంది. మిగుల నవ్వు వచ్చు నాటకమేదైనా రచింపమని పిఠాపురం రాజావారు కోరినప్పుడు పానుగంటివారు ‘కంఠాభరణము” నాటకాన్ని రాశారుట. తట్టుకోలేని వారు చదవకండని ఎమెస్కో వారు ప్రచురించారు. కడుపు చెక్కలయ్యేలా సాగుతుంది ఈ నాటకం.
సరే విషయానికి వస్తే మునిమాణిక్యం వారిది “మన హాస్యము” అనే అద్భుతమైన రచన వుంది. ఆంధ్ర సారస్వత పరిషత్తు వారు 1968లో ప్రచురించారు. మనిమాణిక్యం వారి పుస్తకాలన్నీ చాలా ఏళ్ల కిందటే పునర్ముద్రించారు. ఈ మన హాస్యం మటుకు ఈ మధ్యనే పునః ప్రచురణకు నోచుకుంది. హాస్యం మీద అనేక పుస్తకాలు చదవటం అనవసరం. ఒక్క మునిమాణిక్యం వారి మన హాస్యం చాలు, వంద పుస్తకాల పెట్టు. దాంట్లో మడికి సంబంధించి ఒక వృత్తాంతం ఉంది. దీన్ని మునిమాణిక్యం వారు పానుగంటి వారి ప్రహసనముల నుండి గ్రహించారుట. మడి అనే మాట బ్రాహ్మణ కుటుంబాలలో మాత్రమే వినబడుతుంది. శుచి, శుభ్రతలకోసం ఏర్పాటు చేసిన ఆచారము ఇది. చాలా మంది ఇళ్ళల్లో దండెము అని వెదురు గడ ఒకటి పైన కట్టి ఉంటుంది. స్నానం చేశాక మర్నాటి కోసం అని ఒక తడిబట్ట దండెం మీద ఆరవేసేవారు. అందనంత ఎత్తులో వుంటుంది కనుక పిల్లలు ముట్టుకో లేరు. కర్రతో బట్టను దండెం మీద ఆరవేసేవారు. సంధర్భాన్ని బట్టి మడిలో రకాలు ఉన్నాయి. పసిపిల్లలున్న తల్లులకు మినహాయింపులుంటాయి. ఈ మడి ఆచారాభాసము ఒకసారి ఆస్వాదిద్దాము.
Thursday, July 11, 2013
Wednesday, July 10, 2013
పిచ్చి మా రాజు - పురాణం వారి ఇల్లాలి ముచ్చట్లు
తెలుగు సాహితీ పూలవనంలో పురాణం వారి ఇల్లాలి ముచ్చట్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రికలో ధారావాహికంగా వెలువడ్డ ఈ వ్యాసాలు ఇప్పటిదాకా ఆరు పుస్తకాలుగా వచ్చాయి. మునిమాణిక్యం వారి కాంతంలోలాగా, పురాణం వారి ఇల్లాలి ముచ్చట్లలో కావలసినంత హాస్యం వెల్లివిరుస్తుంది. అప్పట్లో ఆంధ్రజ్యోతిలో వచ్చిన మొక్కపాటి వారి పార్వతీశం లోగో, అలాగే కుంపటి ముందు కూచున్న ఇల్లాలి లోగో బాగా పాపులర్ అయిన లోగోలు. విశ్వంలోని సమస్త విషయాల గురించి ముచ్చటించే ఈ ఇల్లాలి ముచ్చట్ల నుండి కొన్ని ముచ్చట్లు.
“స్వచ్చమైన కమ్మటి పాలు తాగి ఎలాటి మంచి పనులైనా చేయవచ్చు మనం. కానీ అడ్డమైన ఛండాలపు పనులు చేయటం మాన లేకుండా వున్నాం” – గేదె మనసులు.
“పడుచు పిల్ల కొత్త చీర కట్టుకొని తలుపు దగ్గర నిలుచుంటే ఆ తలుపు కాస్త ఓరవాకిలిగా తీసివుంటే చూడ్డానికి ఎంతో బావుంటుంది. గుమ్మాల దగ్గర ఆడవాళ్ళు నిల్చుంటే గుమ్మలు అందంగా వుంటాయి” – రాదే చెలీ నమ్మరాదే చెలీ
“చదువుకున్న ఆడవాళ్ళు మా చదువుకోని స్త్రీలను చూసినంత హీనంగా మీ చదువుకున్న మగాళ్లు చదువుకోని పురుషులను చూడరు” – రేపటి ఆకాశంలో ఆశల హరివిల్లు.
“మీరు నేనుగా ఉన్న మనల్ని మనంగా మార్చేసిన ఇరవై ఉగాదులు ఎక్కడకు వెళ్ళినట్లు చెప్మా” – ఆ ఉగాది మళ్ళీ వస్తుందా
“చంటి పిల్లలు ఏడాది దాటిన పిల్లలు మామిడి పండు తింటుంటే చూడ ముచ్చటగా వుంటుంది. పొట్టనిండా మూతి కళ్ళూ చేతులూ తొడలూ అంతా రసం కారిపోతూ వాళ్ళు ఆనందిస్తుంటే చూసే వాళ్ళ జన్మ ధన్యం. ముద్దు తియ్యగా వుంటుందో లేదో తెలుసుకోవాలంటే ముందు చిన్న పిల్లల్ని ముద్దు పెట్టుకు చూడాలి. ప్రేమ గాఢంగా ప్రయాణంచేసి మాతృత్వం దగ్గరకొచ్చి స్టాపవుతుంది. తల్లి గుణం ప్రేమించే గుణం ఈ రెండూ లోపించిన తరువాత మనుషులు పందులకంటే హీనంగా జీవిస్తారు” – సువ్వరోపాఖ్యానం
“ఆవకాయకు గేదె పెరుగు జోడించి చద్దెన్నం కొట్టేస్తే ఆమత్తులో ప్రపంచం మరోలా కనిపిస్తుంది. ఎండ బెట్టిన మాగాయ ముక్కలు చీకుతూ వుంటే – ఈ మొగుడెందుకు ఈ కాపరమెందుకు ఈ పిల్లలెందుకు ఇదంతా మాయ మిధ్య - ఈ మాగాయ ముక్క ఒక్కటే నిజం, ఇదే కూడా స్వర్గం దాకా వచ్చేది” – అలివేణీ – తరవాణీ
“ప్రజాస్వామిక ప్రభుత్వాలు గాజులు తొడిగించుకు కూర్చుంటే, ప్రతి స్వల్ప విషయానికి కేంద్రంవైపు వెర్రిమొహాలేసుకొని చూస్తుంటే నలికెళ్ళ పాము గూడా ఆదిశేషుడులా బుసలు కొడుతుంది” – సరస సామదాన ........
“మనసులోని కోరికలకు నిద్రలో పూసిన పూలు కలలు” – కలగంటి కలగంటి
“నిద్దట్లో గూడా ఏకపత్నీ వ్రతమే ఏడవమంటావా. మేనర్సు పరాయివాళ్ళ దగ్గర చూపెట్టటానికి, సొంత మనుషుల దగ్గర మేనర్సు ఎందుకు” - మా వారి స్వీట్ డ్రీమ్స్
“ఆధునిక సమాజంలో మనిషి తన అసమర్ధత ఋజువు చేసుకొనే స్థితి వరకూ ఎదుగుతాడు” – పీటర్స్ ప్రిన్సిపుల్
ఇలాంటివి ఈ ముచ్చట్లలో కోకొల్లలు. పురాణం వారిది ఇల్లాలి ముచ్చట్లే గాక “జల తరంగిణి” అనే రచన గూడా వుంది. దాని నిండా కావల్సినన్ని కబుర్లు.
చివరగా 06-09-1974 ఆంధ్రజ్యోతి వారపత్రికలో వచ్చిన “పిచ్చి మా రాజు” అనే ముచ్చట చూద్దాము. అప్పట్లో ఆంధ్రజ్యోతి చిన్న పుస్తకంగా
వచ్చేది. ఇది ఇంతకు ముందు ప్రచురించిన ఆరు పుస్తకాలలో వచ్చినట్లుగా లేదు. ఇది చదివాక 1976లో వచ్చిన శోభన్ బాబు గారి “పిచ్చి మా రాజు” సినిమా గుర్తుకు వస్తుంది. మరి దీన్నే సినిమాగా తీశారా అన్న విషయం తెలియదు.
Monday, July 8, 2013
గణగణ గణగణ జయగంట - ఎస్. వరలక్ష్మి
సినిమాలలో ఎస్. వరలక్ష్మి గారు పాడిన పాటలు తక్కువే అయినా కలకాలం గుర్తుండిపోయే పాటలు పాడారు. ఆవిడ పాడిన “గణగణ గణగణ జయగంట” అనే ఒక ప్రైవేట్ గీతం విందాము. ఇది కూడా ఒకప్పుడు రేడియోలో ప్రసారం అయిన పాట.
Saturday, July 6, 2013
గూటి చిలకేదిరా చిన్నన్నా - తత్వం - ఆకాశవాణి ప్రసారం
ఈ తత్వం అనగానే మనకు బాలమురళికృష్ణ గారు గుర్తుకు వస్తారు. కానీ ఇది ఆయన పాడినది కాదు. ఆయన పాడినది చాలా స్లోగా సాగుతుంది. ఈ పాట స్పీడ్ గా వుంటుంది. చాలా ఏళ్ల కిందట రేడియోలో ప్రసారం అయింది. పాడిన వారి వివరాలు తెలియవు.
Thursday, July 4, 2013
Subscribe to:
Posts (Atom)