ఈ సంవత్సరంలో విడుదల అయిన చిత్రాల తాలూకు లభ్యమైన కొన్ని పోస్టర్స్ కింద పోస్ట్ చేస్తున్నాను. ఇవి ప్రెస్ అకాడమీ వారి వెబ్ సైట్ లోని పాత తెలుగు సంచికల నుండి తీసుకోవటం జరిగింది.
ఈ చిత్రాలకు చెందిన విశేషాలు
గూడా తెలిపితే బావుంటుందని గతంలో ఎవరో అడిగారు. 1995లో కె. ఎన్. టి.
శాస్త్రి గారు “అలనాటి
చలన చిత్రము” అన్న పేరుతో 42 ఆణిముత్యాల్లాంటి
సినిమాల విశేషాలను పుస్తకరూపంలో తెచ్చారు. అది ఇక్కడ పోస్ట్ చెయ్యటం కుదరదు
గాబట్టి దాని బదులుగా “హిందూ” పేపరు “సినిమా ప్లస్” లో ప్రచురించిన ఎం. ఎల్. నరసింహం గారి ఫిల్మ్ రివ్యూల
లింకులు ఇస్తున్నాను ఆసక్తి ఉన్నవారు వీక్షించండి. చాలా ఆసక్తికరమైన విషయాలు
తెలుస్తాయి.
ఈ సినిమాలలో మనకు లభిస్తున్నది
వాహిని వారి భక్త పోతన మాత్రమే. ఈ సంవత్సరంలో వచ్చిన మరో మరువలేని సినిమా జెమిని
వారి బాలనాగమ్మ. 1987 ప్రాంతాల్లో ఢిల్లీ దూరదర్శన్ వారు ఈ సినిమా
ప్రసారం చేశారు. మాయల మరాఠి పాత్ర వేసిన గోవిందరాజుల సుబ్బారావు గారి నటన
మరువలేనిది. ఆ సినిమా ప్రభావం పాతాళ భైరవిలో కనిపిస్తుంది. ఒకనాటి అందాలబాల
కాంచనమాల గారి రూపం గూడా మరువలేనిది. 1938 నాటి సినిమాల విశేషాలు పోస్ట్
చేసినప్పుడు బాలనాగమ్మ సినిమాలో పుష్పవల్లి గారు పాడిన “నా
సొగసే గని మరుడే దాసుడు గాడా” అన్న పాట పోస్ట్ చేశాను. ఈ
సినిమాకి రాజేశ్వరరావు గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇక్కడ బాలనాగమ్మ
సినిమాలో మరాఠి భయంకరమైన కాపాలిక, క్షుద్రదేవతలను పూజించే సన్నివేశంలో
వచ్చే ఒక ఆడియో బిట్ వినండి. ఈ ధ్వనులు ఎలా పుట్టించారో గాని. దీనబంధు సినిమాలో
టంగుటూరి సూర్యకుమారి గారివి ఐదు ఆణిముత్యాల్లాంటి పాటలు వున్నాయి. అవి
మరోసారెప్పుడైనా విందాము.
కొసమెరుపు:
అదే సంవత్సరంలో వచ్చిన “ శాంత బాలనాగమ్మ” పేరు విన్నాము, అలాగే ఎన్. టి. ఆర్. నటించిన “బాలనాగమ్మ” పేరు
విన్నాము. కానీ ప్రకటనకే పరిమితమయినట్లున్న ప్రతిభా వారి “బాలనాగమ్మ”
పోస్టర్ చూడండి.
Thanks alot.
ReplyDeleteMy father acted in Gemini Balanagamma, Jevvanmukthi.
కె. ఎన్. టి. శాస్త్రి గారు “అలనాటి చలన చిత్రము” అన్న పేరుతో 42 ఆణిముత్యాల్లాంటి సినిమాల విశేషాలను పుస్తకరూపంలో తెచ్చారు.
ReplyDeleteఈ పుస్తకం మీకు వీలైతే అందించ మనవి
annintiki@gmail.com
స్కాన్ చేసి పంపటం కుదరదు. మన్నించాలి
Deleteఇంతటి చక్కని విషయాలను తెలియజేసినందుకు మీకు ధన్యవాదములు. ఇటువంటి మరెన్నో అలనాటి చిత్రాలు వాటి విశేషాలను మాకు అందించమని కోరుకుటున్నాను.
ReplyDelete