Saturday, August 3, 2013

గంధర్వ గోత్రాన పుట్టిన తెరవేలుపులు - వి. ఎ. కె. రంగారావు

పాత తెలుగు సినిమా పాటలు ఇష్టపడేవారికి V A K RANGA RAO రంగారావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వారి మాట, రచన ప్రత్యేకంగా వుంటాయి. గతంలో వారి ప్రత్యేక జనరంజని కార్యక్రమాన్ని ఆరు భాగాలుగా పోస్ట్ చేశాను. పాత సినిమా పాటల మీద రీసెర్చ్ చేసే వాళ్ళకు వారి రచనలు ప్రామాణికాలు. 1999లో ఆంధ్రప్రభ వాళ్ళు “మోహిని” అన్న పేరుతో అరవై ఎనిమిది సంవత్సరాల తెలుగు సినిమా ప్రస్థానం అంటూ విశేష ప్రచురణ రెండు సంపుటాలుగా తీసుకు వచ్చారు. అందులో ప్రచురితమైన “గంధర్వ గోత్రాన పుట్టిన తెరవేలుపులు” అన్న వి. ఎ. కె. రంగారావు గారి విశేషమైన వ్యాసం చూడండి. కలకాలం భద్రపరచవలసిన వ్యాసం ఇది. 


































1986లో  హెచ్. ఎమ్. వి. వారు రంగారావు గారి ఆధ్వర్యంలో అలనాటి అందాలు అని నాలుగు పాటల క్యాసెట్లు విడుదల చేశారు. ఇప్పుడంటే ఇంటర్నెట్లో దొరుకుతున్నాయి కానీ ఆరోజుల్లో ఆ క్యాసెట్లే ఆధారం. అధ్బుతమైన పాటలు అందులో పొందుపరచారు. 

  








1 comment:

  1. వి.ఎ.కే.రంగారావు గారు చలనచిత్రసంగీతం మీద సాధికారంగా వ్యాఖ్యానించగల పాటల ప్రియుడు!వారింకా ఎన్నెన్నో అలనాటి విశేషాలు సవివరంగా విస్తారంగా చరిత్రకెక్కించ వచ్చు!ఆయన చలనచిత్రసంగీత చరిత్రకారుడు!తెలుగు భాషలోని సొబగులు మల్లాది రామకృష్ణశాస్తిగారి ముఖతః సాంగోపాంగంగా తెలుసుకున్నవాడు!తెలుగుభాషమీద అధికారం ఉన్నవాడు!ఆయన చివరిక్షణం వరకు విరివిగా ఇబ్బడిముబ్బడిగా రచనలు చేసి చలనచిత్ర చరిత్రను పరిపుష్టం చేయాలని నా వేడికోలు!!!

    ReplyDelete