జానపద గేయాలు వినసొంపుగా ఉంటాయి. అందునా అందులో అనసూయా దేవి గారి హస్తమున్నదంటే ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఈ పాటలు రికార్డింగ్ కంపెనీల వారి కోసం పాడినవి కొన్ని అయితే, అవే పాటలు మళ్ళీ ఆకాశవాణి వారి కోసం పాడటం, వేదికలమీద పాడటం జరిగింది. వినబోయే పాటలో అనసూయ గారితో ప్రయాగ నరసింహశాస్త్రి గారు గొంతు కలిపినట్లుగా వుంటే, రేడియోవారి పాటలో కె. బి. కె. మోహన్ రాజు గారు గొంతు కలిపారు. చెంచితను వల్లో వేసుకోటానికి కృష్ణుడు నానా రకాలుగా ప్రాధేయపడుతుంటే, చెంచిత కృష్ణుడిని నానా చివాట్లు ఎలా పెడుతోందో విందాము.
తెలుగు స్వతంత్ర నుండి
|
అనసూయా దేవి గారి జానపదగేయాలు నుండి
|
అత్యద్భుతం! మీ సేకరణావివరాలు అమోఘం
ReplyDeleteశ్రీ కె.బి.కె. మోహనరాజు గారికి నమస్కారం. మీవంటివారు నా బ్లాగులో వ్యాఖ్య రాయటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. “నీదేరా భారతదేశం” దేశభక్తిగేయం మీరు పాడినట్లుగా తెలిసింది. ఈ గేయం మార్చి 2014లో నా బ్లాగులో పోస్ట్ చేశాను, దాని లింకు ఇది
Deletehttp://sobhanaachala.blogspot.in/2014/03/blog-post_8038.html
ఇది యుట్యూబ్ లింకు
https://www.youtube.com/watch?v=i5AnVKQQiao
ధన్యవాదాలు
can I use this writeup for posting in my father(K.B.K.Mohan Raju) FB account : https://www.facebook.com/kbk.mohanraju
ReplyDeleteI have the song with me recorded very long back on tapes. recently published a post on Dr.Anasuya devigaru on KBK FB account..
thank you for sharing lyrics and writeup...very nice.
Vijay Konda
విజయ్ గారికి
Deleteమీరు ఈ బ్లాగుకు సంబంధించిన సమాచారాన్ని వాడుకోటానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కావాలనుకుంటే లింకు కూడా ఇవ్వవచ్చు.
ధన్యవాదాలు