Monday, September 29, 2014

వలపు లేలనే సఖీ – భావ గీతాలు

“వలపు లేలనే వింత తలపు లేలనే సఖీ” అనే ఈ గీత రచన మంగళంపల్లి వారని “ఈమాట.కాం” లో చదివాను. బహుశా పాడింది గూడా వారే అయి ఉంటారు. ఈ గీతం విని చూద్దాము. అలాగే “భూధరమో సాగరమో భూతలమో ఆకసమో” అనే గీతం (పరుచూరి శ్రీనివాస్ గారి సేకరణ) మంగళంపల్లి వారు పాడినది “ఈమాట.కాం” లో దర్శనమిస్తుంది. అయితే ఇక్కడ ఇప్పుడు వినబోయే పాట వేరే వారు పాడినట్లున్నారు. ఈ రెంటితో పాటు “పంచవన్నెల రామచిలుకా పారిపోకమ్మా” అనే గీతం కూడా విని ఆనందిద్దాము. ఆకాశవాణి వారి ప్రసారాలనుండి. 


 వలపు లేలనే వింత తలపు లేలనే సఖీ




 భూధరమో సాగరమో భూతలమో


 పంచవన్నెల రామచిలుకా పారిపోకమ్మా


పరుచూరి శ్రీనివాస్ గారు “ఈమాట.కాం” లో అరుదైన ఒక ఆరు జాతీయ గీతాలను పంచుకున్నారు. వాటిలో ఓ మూడింటికి ఇక్కడ సాహిత్యాన్ని పోస్ట్ చేస్తున్నాను. ఈ కింది లంకె ద్వారా అక్కడ వింటూ ఇక్కడ చూస్తూ ఆస్వాదించండి. 













Tags: Valapu lelane vimtha talapu lelane, Bhoodharamo saagaramo bhootalamo aakasamo, Panchavannela raama chilukaa paaripokammaa, lalitha gethalu, Bhaga geethalu, Lalitha geyalu, Light music, Aakashavani,

5 comments:

  1. వెంకటరమణగారు: "వలపు లేలనే వింత తలపు లేలనే సఖీ” పాడింది బాలమురళిగారే! మీరు వినిపిస్తున్న “భూధరమో సాగరమో భూతలమో ఆకసమో” పాడింది చిత్తరంజన్ గారు.

    భవదీయుడు, శ్రీనివాస్

    ReplyDelete
    Replies
    1. పాడినవారి వివరాలు తెలిపినందుకు శ్రీనివాస్ గారికి అభివాదములు

      Delete
  2. వెంకట రమణ గారూ "పంచవన్నెల రామచిలుకా పారిపోకమ్మా " పాడింది శ్రీపాలగుమ్మి విశ్వనాథం గారు
    నమస్తే- టి వి రావ్

    ReplyDelete
    Replies
    1. శ్రీ టి. వి. రావు గారికి ధన్యవాదాలు. పాడినవారి వివరాలు తెలిపినందుకు సంతోషం

      Delete