హాయిగా వింటుంటే మధ్యలో సాహిత్యం ఎందుకు అని అనిపించవచ్చునేమోగాని, విన్నాక సాహిత్యం దొరికితే బావుంటుందనిపిస్తుంది. ఈ బ్లాగులో చాలా పాటలకు సాహిత్యం సమకూర్చుకుంటూ రావటం జరుగుతోంది. ఈ క్రమంలో రకరకాల పుస్తకాల సేకరణ జరిగింది. వాటిల్లో పాటలు, గేయాలు, కవితలు, కీర్తనలకు సంబంధించిన కొన్ని పుస్తకాల ముఖచిత్రాలు ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది.
దామెర్ల సత్యవాణి గారు గీసిన చిత్రం – గృహలక్ష్మి నుండి
|
వీటిల్లో చాలావరకు DLI, INTERNET ARCHIVE నుండి సేకరించినవే. ఇప్పుడు కొనాలంటే కొన్ని దొరకవు. కొన్ని పూర్తిగాను, కొన్ని పాక్షికంగాను సేకరించటం జరిగింది. కొన్ని PDF ఫార్మాట్లో, మరికొన్ని వేరే ఫార్మాట్లో వున్నాయి. ఇవన్నీ బ్లాగులో పెట్టటం సముచితంకాదు.
పైన గమనిస్తే కొన్ని పుస్తకాలకు రెడ్ కలర్లో ఓ గుర్తు ఉన్నది, అవి PDF ఫార్మాట్లో పూర్తిగా ఉన్న పుస్తకాలు, వాటిల్లోంచి ఏవన్నా ముఖ్యమైనవి కావాలనుకుంటే నా మెయిల్ఐడికి మెయిల్ ఇవ్వండి.
చివరగా పరుచూరి శ్రీనివాస్ గారి సేకరణ “ఊర్మిళాదేవి నిద్ర” ఈ కింది లింకు ద్వారా వింటూ సాహిత్యాన్ని చూద్దాము. వినబడే పంక్తులు గుర్తించటం జరిగింది.
కృష్ణశ్రీ గారి “స్త్రీల రామాయణపు
పాటలు” నుండి
|
Tags:
Lalitha geyalu books, Lalitha geethalu books, Patala books,
No comments:
Post a Comment