మనకు తెలుగులో ఎన్నో జాతీయోక్తులు ఉన్నాయి. దాంట్లో “గాలీవానా వస్తే కధే పోయింది” అన్నది ఒకటి. ఇది శ్రీపాద వారి కధకాదు. ఈ జాతీయం వెనుకదాగిన కధను వారు మనకు తెలియబరుస్తున్నారు. ఇది “కళ్యాణి” అన్న 1931 నాటి సంచికలో ప్రచురితమైనది. అయితే దీనికంటే ముందు శ్రీపాద వారి గురించి శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు “ఆనందవాణి” సంచికలో వ్రాసినది చూద్దాము. చివర్లో మల్లాది వారు ఇలా అంటున్నారు “ఆయన రచనలు మరో భాషకు లొంగవు. జాను తెనుగు నేర్చినవారికే, తెలుగువారైనా వారికే శ్రీ శాస్త్రి గారి కధలు చదివి ఆనందించే అదృష్టము”.
శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు |
గతంలో శ్రీపాద
వారి మీద చేసిన పోస్ట్ లింకు
Tags: sripada
subrahmanya sastry
అద్భుతం. మంచి కథ అందించినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteధన్యవాదాలు
Deleteమరొక మాట చెప్పటం మరిచాను. శ్రీపాద సుబ్రహ్మణ్య శర్మ గారి సాహితీ సర్వస్వం తయారీలో ఉన్నది. మనసు ఫౌండేషన్ వారు ప్రచురించబోతున్నారు. వారి రచనలను సేకరించే పనిలో ఉన్నారు. మీకు దొరికిన శ్రీపాద వారి కథలు ఇతర రచనలు మన శ్యాంనారాయణగారికి అన్ని వివరాలతో (ఏ పత్రికలో, ఎప్పుడు ప్రచురించబడినది మొదలగునవి) పంపండి, వారివద్ద ఇప్పటికే లేకపోతె సాహితీ సర్వస్వం తయారీలో ఉపయోగపడుతుంది. శ్యాం గారి మెయిలు syamnarayana.t@gmail.com
ReplyDeleteఈ అబ్యర్ధన మీ ఒక్కరికే కాదు, మీ బ్లాగుకు వచ్చి మీరు వ్రాస్తున్న చక్కటి ఉపయోగపడే పరిచయాలను చదువుతున్న అందరికీ.
ఇంతకుముందు శ్యాంనారాయణగారు శ్రీపాదవారి కధలు దొరకనివి మెయిల్ ఇచ్చారు. అయితే అవి ఎక్కడా ప్రస్తుతానికి కనబడలేదు. విశాలాంధ్ర వారికీ ఇవేకధలు దొరికినట్లులేదు. విశాలాంధ్రవారు శ్రీపాదవారి సాహిత్యాన్ని దొరికినంతవరకు ప్రచురించారు. నా దగ్గర వారి 12 చిన్నకధల్లో 10 కధలు, 2 రూపికలు, 1 నవల మొత్తం 13 పుస్తకాలదాకా ఉన్నాయి (పాత ప్రచురణలు). శ్రీపాదవారి “ప్రబుద్ధాంద్ర” సంచికలు 32 దాకా PDF ఫార్మాట్లో సేకరించాను. దాంట్లో కధలన్నీ విశాలాంధ్రవారు ప్రచురించారు. పైన పోస్ట్ చేసిన రెండు కాక, ఇవాళే శ్రీపాదవారిమీద పిలకా గణపతి శాస్త్రిగారు వ్రాసిన ఒక వ్యాసం, శ్రీపాదవారి షష్ఠిపూర్తి గురించి ఒక వ్యాసం లభించాయి.
Delete