Friday, August 30, 2013
Thursday, August 29, 2013
శ్రీకృష్ణ రాయబారం పద్యాలు – ఈలపాట రఘురామయ్య
"srikrishna rayabaram" శ్రీకృష్ణ రాయబారం సినిమాలో (1960) శ్రీకృష్ణ పాత్రధారి పద్మశ్రీ "k raghuramayya" ఈలపాట రఘురామయ్య గారు పాడిన పద్యాలు విందురుగాని. ఈ పద్యాలు "tirupati venkata kavulu"శ్రీ తిరుపతి వెంకటకవులు రచియించిన “పాండవోద్యోగము” "pandavodyogamu" లోనివి అన్న విషయం తెలిసినదే. ఈ పద్యాలు ఎన్నోమార్లు ghantasala ఘంటసాల గారి గళంలో ఏదో ఒక రూపంలో వింటూనేవుంటాము. కానీ "eelapata" రఘురామయ్య గారి గళంలో చాలా అరుదుగా వినబడుతూ ఉంటాయి. రఘురామయ్యగారు పాడిన 21 పద్యాలు padyalu ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది. అధ్భుతమైన ఆయన గాన మాధుర్యాన్ని ఆస్వాదిద్దాము.
raghuramayya |
tirupati venkata kavulu |
మొదటి భాగము
రెండవ భాగము
మూడవ భాగము
Monday, August 26, 2013
మన మధుర గాయకులు – ఎం. ఎస్. రామారావు – విశాల ప్రశాంత
“తెలుగు స్వతంత్ర” వారపత్రికలో “మన మధురగాయకులు” శీర్షికన (ప్రెస్ అకాడమీ సౌజన్యం) ఎం. ఎస్. రామారావు గారి గురించి ప్రచురించిన ఒక వ్యాసం చూద్దాము. ఇలాంటి పాత వ్యాసాలవల్ల కొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి.
నీరాజనం సినిమాలో “విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించు జహాపనా” పాట చాలా మంది వినే ఉంటారు. ఈ పాట బాగా ప్రచారం పొందినది. స్వీయ రచన అయిన ఈ పాటను అంతకుముందే స్వీయ సంగీతంలో ఆయన స్వయంగా పాడారన్న విషయం కొంతమందికి తెలియక పోవచ్చు. కింది వ్యాసంలో పేర్కొన్న దాన్ని బట్టి ఈ పాట 1950 ప్రాంతాల్లోనే బాగా ప్రసిద్ధి పొందినట్లుగా తెలుస్తోంది. వ్యాసం చివర్లో నీరాజనం సినిమాలోని పాటను, దాని మాతృకను విని ఆనందిద్దాము.
ముందుగా ఒరిజనల్ సాంగ్
నీరాజనం సినిమాలో సాంగ్ (సంగీతం ఓ. పి. నయ్యర్)
ఎటువంటి అభ్యంతరాలున్నా ఈ పాటలు, ఫోటోలు (బ్రిటిష్ లైబ్రరి వారి సేకరణ నుండి) తొలగించబడతాయి
Friday, August 23, 2013
Thursday, August 22, 2013
Wednesday, August 21, 2013
కనుగొంటి కనుగొంటి నీ కంట నేడు – ఆకాశవాణి శ్రవ్యతరంగం
“కనుగొంటి కనుగొంటి నీ కంట నేడు” అంటూ రేడియోలో ప్రసారమైన ఈ లలిత గేయాన్ని వినండి. ఇది భక్తి గేయాన్ని తలపిస్తోంది. పాడిన వారి వివరాలు ప్రకటించలేదు. శ్రీరంగం గోపాలరత్నం గారా అనిపిస్తుంది ఒకసారి. బాలసరస్వతి గారేమో అనిపిస్తుంది మళ్ళీ. ఏది ఏమైనా కమనీయమైన గాత్రం. ఈ కింది యూట్యూబ్ ప్లేయర్ ద్వారా వినండి. లేదంటే ఆడియో ప్లేయర్ ద్వారా నైనా వినవచ్చు.
Tuesday, August 20, 2013
అత్తలేని కోడలు – నిను నేను మరువలేనుర – కృష్ణవేణి –జిక్కి
ఈ పాటలు తలవంగానే మనకు ఘంటసాల గారు గుర్తుకు వస్తారు. ఈ పాటలకు మూలం 1949లో వచ్చిన మనదేశం సినిమా. ఈ సినిమాలో “అత్తలేని కోడలు ఉత్తమురాలు ఒలమ్మా” అనే దంపుళ్ళ పాట కృష్ణవేణి గారు, “నిను నేను మరువలేనుర ఓ పొన్నకాయవంటి పోలీసెంకటసామి” అనే పాట జిక్కి గారు పాడారు. ఈ సినిమాకు సంగీతం ఘంటసాల గారు. సంగీత దర్శకుడిగా ఇది ఆయనకు మొదటి సినిమా. ఈ రెండు పాటలు ఆయన తరువాత ప్రైవేట్ రికార్డులుగా ఇచ్చారు. కృష్ణవేణి, జిక్కి గార్లు పాడిన ఆ పాటలు విని చూద్దాము. “అత్తలేని కోడలు ఉత్తమురాలు ఒలమ్మా” పాట లాంటి వేరే పాట యొక్క సాహిత్యం గృహలక్ష్మి సంచికలో ప్రచురితమైనది చూడండి
Friday, August 16, 2013
కృష్ణుడు చెంచిత – అనసూయా దేవి
జానపద గేయాలు వినసొంపుగా ఉంటాయి. అందునా అందులో అనసూయా దేవి గారి హస్తమున్నదంటే ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఈ పాటలు రికార్డింగ్ కంపెనీల వారి కోసం పాడినవి కొన్ని అయితే, అవే పాటలు మళ్ళీ ఆకాశవాణి వారి కోసం పాడటం, వేదికలమీద పాడటం జరిగింది. వినబోయే పాటలో అనసూయ గారితో ప్రయాగ నరసింహశాస్త్రి గారు గొంతు కలిపినట్లుగా వుంటే, రేడియోవారి పాటలో కె. బి. కె. మోహన్ రాజు గారు గొంతు కలిపారు. చెంచితను వల్లో వేసుకోటానికి కృష్ణుడు నానా రకాలుగా ప్రాధేయపడుతుంటే, చెంచిత కృష్ణుడిని నానా చివాట్లు ఎలా పెడుతోందో విందాము.
తెలుగు స్వతంత్ర నుండి
|
అనసూయా దేవి గారి జానపదగేయాలు నుండి
|
Wednesday, August 14, 2013
ఈనాడే పదిహేనవ తేదీ – టంగుటూరి సూర్యకుమారి
దేశభక్తి గేయాలు, ప్రభోదాత్మక గేయాలు అనంగానే టంగుటూరి సూర్యకుమారి గారు గుర్తుకు వస్తారు. ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రజనీకాంతరావు గారి సంగీత సారధ్యంలో ఆవిడ పాడిన “ఈనాడే పదిహేనవ తేదీ” అన్న గేయం మరొక్కసారి మననం చేసుకుందాము.
మరి సంధర్భం వచ్చింది కాబట్టి
ఆవిడ పాడినవే “మ్రోయింపు జయభేరి –
ఉదయెమ్మాయెను” అన్న గీతాలు కూడా ఆలకిద్దాము. వీటి రచనా,
సంగీతం రజని గారు.
Monday, August 12, 2013
Sunday, August 11, 2013
Saturday, August 10, 2013
1942 లో విడుదలైన చిత్రాల పోస్టర్స్
ఈ సంవత్సరంలో విడుదల అయిన చిత్రాల తాలూకు లభ్యమైన కొన్ని పోస్టర్స్ కింద పోస్ట్ చేస్తున్నాను. ఇవి ప్రెస్ అకాడమీ వారి వెబ్ సైట్ లోని పాత తెలుగు సంచికల నుండి తీసుకోవటం జరిగింది.
ఈ చిత్రాలకు చెందిన విశేషాలు
గూడా తెలిపితే బావుంటుందని గతంలో ఎవరో అడిగారు. 1995లో కె. ఎన్. టి.
శాస్త్రి గారు “అలనాటి
చలన చిత్రము” అన్న పేరుతో 42 ఆణిముత్యాల్లాంటి
సినిమాల విశేషాలను పుస్తకరూపంలో తెచ్చారు. అది ఇక్కడ పోస్ట్ చెయ్యటం కుదరదు
గాబట్టి దాని బదులుగా “హిందూ” పేపరు “సినిమా ప్లస్” లో ప్రచురించిన ఎం. ఎల్. నరసింహం గారి ఫిల్మ్ రివ్యూల
లింకులు ఇస్తున్నాను ఆసక్తి ఉన్నవారు వీక్షించండి. చాలా ఆసక్తికరమైన విషయాలు
తెలుస్తాయి.
ఈ సినిమాలలో మనకు లభిస్తున్నది
వాహిని వారి భక్త పోతన మాత్రమే. ఈ సంవత్సరంలో వచ్చిన మరో మరువలేని సినిమా జెమిని
వారి బాలనాగమ్మ. 1987 ప్రాంతాల్లో ఢిల్లీ దూరదర్శన్ వారు ఈ సినిమా
ప్రసారం చేశారు. మాయల మరాఠి పాత్ర వేసిన గోవిందరాజుల సుబ్బారావు గారి నటన
మరువలేనిది. ఆ సినిమా ప్రభావం పాతాళ భైరవిలో కనిపిస్తుంది. ఒకనాటి అందాలబాల
కాంచనమాల గారి రూపం గూడా మరువలేనిది. 1938 నాటి సినిమాల విశేషాలు పోస్ట్
చేసినప్పుడు బాలనాగమ్మ సినిమాలో పుష్పవల్లి గారు పాడిన “నా
సొగసే గని మరుడే దాసుడు గాడా” అన్న పాట పోస్ట్ చేశాను. ఈ
సినిమాకి రాజేశ్వరరావు గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇక్కడ బాలనాగమ్మ
సినిమాలో మరాఠి భయంకరమైన కాపాలిక, క్షుద్రదేవతలను పూజించే సన్నివేశంలో
వచ్చే ఒక ఆడియో బిట్ వినండి. ఈ ధ్వనులు ఎలా పుట్టించారో గాని. దీనబంధు సినిమాలో
టంగుటూరి సూర్యకుమారి గారివి ఐదు ఆణిముత్యాల్లాంటి పాటలు వున్నాయి. అవి
మరోసారెప్పుడైనా విందాము.
కొసమెరుపు:
అదే సంవత్సరంలో వచ్చిన “ శాంత బాలనాగమ్మ” పేరు విన్నాము, అలాగే ఎన్. టి. ఆర్. నటించిన “బాలనాగమ్మ” పేరు
విన్నాము. కానీ ప్రకటనకే పరిమితమయినట్లున్న ప్రతిభా వారి “బాలనాగమ్మ”
పోస్టర్ చూడండి.
Subscribe to:
Posts (Atom)