Monday, December 29, 2014

దేశభక్తి గేయాలు వివిధ భాషల్లో

ఈ మధ్య DLI లో ఏదో పుస్తకం కోసం వెతుకుతుంటే RSS వారిది 1956 నాటి “విజయ విపంచి” అనే గేయాల పుస్తకం దొరికింది. ఈ గేయాలేమన్నా నెట్లో దొరుకుతాయాని వెతుకుతుంటే ఒక వెబ్సైట్లో అనేక భాషల దేశభక్తి గేయాలు ఆడియోతో పాటుగా సాహిత్యాన్ని కూడా పొందుపరిచారు.  అయితే రాసిన, పాడిన వారి వివరాలు తెలియపరచలేదు. ఈ కింది లింకు ద్వారా ఆ గేయాలు అక్కడే విని కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.  ఈ పుస్తకం కోడ్ నెంబర్ 9000000008468 పేజీలు 80 దాకా వున్నాయి. కావాలనుకున్నవారు DLI నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.


















 చివరగా “వింత వింత రూపులతో ఎంతమారిపోయిందోయ్ మాదేశం భారతదేశం” అనే దేశభక్తి గేయం ఒకటి విందాము. ఇది ఆకాశవాణి కడప కేంద్రం వారి ప్రసారం.









Tags: Desabhakthi geyalu, Vimtha vimtha roopulatho, Vijaya vipamchi 

Saturday, December 27, 2014

సజీవ స్వరాలు – శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు

సజీవ స్వరాలు లో మధురగాయకుడు ఘంటసాల గారి స్వరం విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. 











Tags: Ghantasala, Ghantasala Venkateswara Rao

Friday, December 26, 2014

నేదునూరి గంగాధరం గారి జానపద సాహిత్యం

శ్రీ నేదునూరి గంగాధరం గారు సేకరించినంత జానపద సాహిత్యం మరొకరు సేకరించి ఉండరు. వారి “మిన్నేరు”, “మున్నీరు” పుస్తకాలలో అసంఖ్యాకమైన జానపద గేయాలు దర్శనమిస్తాయి. వారి “పసిడి పలుకులు” ఒక మహత్తర గ్రంధం. దీంట్లో వేలకొద్ది సామెతలు, జాతీయాలు ఇంకా అనేకానేక విషయాలు లభిస్తాయి. ఇది మరో పెద్దబాలశిక్ష. వారి రచనల ముఖచిత్రాలు కొన్ని చూద్దాము. 







Source: visakhateeraana.blogspot.in




























వారి పసిడి పలుకులు నుండి ఒక అంశం చూద్దాము 








వారి ఇతర రచనల వివరాలు 






జానపద సాహిత్యానికి మూలముగా చెప్పుకొనే శ్రీ నందిరాజు చలపతిరావు గారి 1922 నాటి స్త్రీలపాటల పుస్తకం ముఖచిత్రం, విషయసూచిక గమనించండి. 1897లో దీని మొదటిభాగం ప్రచురించారుట. 









వీటిలో మున్నీరు”, పసిడి పలుకులు తప్ప మిగతావి శోధిస్తే DLI లో  దొరుకుతాయి. 



చివరగా అనసూయాదేవి గారు  మరియు బృందం పాడిన ఒక జానపద గేయం విందాము


 



Tags: Nedunuri Gamgadharam, Munneeru, Minneru, Pasidi Palukulu

Wednesday, December 24, 2014

సజీవ స్వరాలు – గుమ్మడి వెంకటేశ్వరరావు గారు

ఇవాళ ప్రముఖ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఆకాశవాణి వారికి ఇచ్చిన ఇంటర్వ్యూ విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. 












Tags: Gummadi Venkateswara Rao

Tuesday, December 23, 2014

శివ కీర్తనలు – భక్తిరంజని

శ్రీ గోపరాజు వెంకట సుబ్బారావు విరచిత “శరణు శరణు శరణు శంకర” – “విడువజాలను నిన్ను నేను” –“శివ శంభో మహదేవ” – “నీలకంధర నిన్నే నమ్మితి” అనే నాలుగు శివ కీర్తనలు ఆలకిద్దాము.











 శరణు శరణు శరణు శంకర




 విడువజాలను నిన్ను నేను





శివ శంభో మహదేవ





నీలకంధర నిన్నే నమ్మితి




Tags: Siva Keerthanalu, Goparaju Venkata Subbarao, Saranu saranu saranu samkara, viduvajaalanu ninnu nenu,  siva sambho mahadeva, neelakandhara ninne nammithi, Bhakthiranjani




Sunday, December 21, 2014

తిరుప్పావై సప్తపది – 5వ రోజు – బాలమురళి, శ్రీరంగం

మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీరంగం గోపాలరత్నం గార్లు పాడిన తిరుప్పావై సప్తపది అయిదవరోజు పాశురం ఆస్వాదిద్దాము. ఇది ఆకాశవాణి విజయవాడ కేంద్రంవారి ప్రసారాల నుండి.  చివరగా “రుక్మిణీ కళ్యాణం సదా దృశ్యతాం” అనే నారాయణతీర్ధులవారి తరంగం ఒకటి విందాము. ఇది హైదరాబాద్ కేంద్రంవారి ప్రసారం. 


































Tags: Thiruppavai, Sapthapadi, Mangalampalli Bala Murali Krishna, Sreerangam Gopalarathnam, Tharamgalu, Narayanatheerdha, Rukminee kalyaanam sada drusyatham