Sunday, January 12, 2014

కీలుగుఱ్ఱం సినిమా టైటిల్ సాంగ్ పూర్వాపరాలు

మీర్జాపురం రాజా గారి దర్శకత్వంలో వచ్చిన శోభనాచల వారి మహత్తర జానపద చిత్రం కీలుగుఱ్ఱం . ఈ చిత్రం టైటిల్స్ వస్తున్నప్పుడు కృష్ణవేణి గారు పాడిన “శోభనగిరి నిలయా దయామయ” అనే పాట వినబడుతుంది. ఈ పాట పూర్వాపరాల్లోకి వెళితే విజయవాడకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణ్యక్షేత్రం ఆగిరిపల్లి. అక్కడ శోభనాద్రి మీద కొలువైన స్వామినే శోభనాచల స్వామిగా, శ్రీ లక్ష్మీ వ్యాఘ్ర నృసింహ స్వామిగా కొలుస్తారు. ఈ స్వామి పేరునే శోభనాచల స్టూడియో నెలకొల్పారు. ఈ పాట మధ్యలో “ఆగిరిపల్లి విహార” అని, పాట చివర్లో “సరస శోభనాచల చిత్రసభా సంఘ రక్షణ” అని వినవస్తుంది. ఈ పాట వివరాలు అక్కడ దేవాలయంలోని శిలాఫలకం మీద కానవస్తాయి. 















ఈ సినిమా గురించిన మరింత సమాచారం కొఱకు హిందూ లో వచ్చిన ఒక ఆర్టికల్ ఈ కింది లింకు ద్వారా చూడండి.

1927

1927

1927

1927

1927

1930

1930
































చివరగా ఈ సినిమాలోవి రెండు సుమధుర గీతాలు విందాము. 
సంగీతం ఘంటసాల

కాదు సుమా కల కాదు సుమా  - ఘంటసాల, వక్కలంక సరళ





తెలియవమా ఘంటసాల, కృష్ణవేణి 




Tags: keelugurram, sobhanachala, agiripalli

15 comments:

  1. -thanks for giving very good songs from a very old and popular film,rarely heard nowadays.

    ReplyDelete
  2. మీ బ్లాగులో మీరు కొత్త పోస్ట్ చేసినప్పుడల్లా ఒక "అలర్ట్" ఆసక్తి కలవారికి వచ్చే విధంగా ఒక విడ్జెట్ ఉన్నది. అది దయచేసి ఏర్పాటు చెయ్యగలరు. మీరు కొత్త రికార్డింగ్ లు అప్లోడ్ చేసినట్టు వెంటనే మాలాంటి ఆసక్తి కల వారికి తెలుస్తుంది.

    ReplyDelete
  3. మీరడిగిన విడ్జెట్ మొదట్లో పెట్టి తరువాత తీసేశాను. ఇప్పుడు పెడదామని చూస్తే కొన్ని బ్రౌజర్స్ సపోర్ట్ చెయ్యటం లేదు. ఆ మాట కొస్తే మీ బ్లాగులో కూడా సభ్యులుగా చేరే లింకు పనిచేస్తునట్లు లేదు.

    ReplyDelete
  4. రమణగారూ,

    బ్లాగర్ సెట్టింగుల్లో మొబైల్ అండ్ ఇ మైల్ అనే టాబ్ ఉన్నది. అందులో చివరగా ఒక ఆప్షన్ "పోస్ట్ లను దీనికి ఇమెయిల్ చెయ్యి" అని ఉన్నది. అందులో 10 ఇ మైళ్ళ దాకా అనుసంధించవచ్చు. మీరు పోస్టు చెయ్యగానే అందులో ఉన్న ఈ మైళ్ళకు ఒక ఈ మైల్ పంపబడుతుంది. అందులో దయచేసి నా ఈ మైల్ (vu3ktb@gmail.com) అనుసంధించగలరు.

    ReplyDelete
  5. Dear Venkata Ramana garu, nice collections. Chala Santhosham ga vundhi.

    ReplyDelete
  6. Thanks for giving very good songs from a very old and popular film,rarely heard nowadays.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు

      Delete
    2. Garikapati srinivasa murthyMarch 3, 2017 at 4:41 AM

      Ramana neeseva adbhutam mana telugu varandu nee blog chedavalani asistu srinivasa murthy garikapati

      Delete
  7. వెంకటరమణ గారికి శోభనాచాలస్టూడిఓ,చరిత్ర తెలిపినందుకుధన్య వాదాలు మనదాంధ్ర ప్రదేశ్ లో నున్న క్షేత్రముల గూర్చి చాలావిషయాలు మాబోంట్లకు తెలియవు .మరోసారి ధన్యవాదములు

    ReplyDelete
  8. శ్రీ శోభనాచలవ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి
    వేదాలకు, పుణ్య క్షేత్రాలకు పుట్టినిల్లయిన మన భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని, కృష్ణా జిల్లా , విజయవాడ – నూజివీడు పట్టణములకు సరిగ్గా మధ్యలో గల ఆగిరిపల్లి గ్రామంలో, కృష్ణా నదీ తీరమున ఆనుకొని ఉన్న శ్రీ “శోభనాద్రి పర్వతం” పైన స్వయం వ్యక్తముగా వెలసి,“శోభనాచలస్వామి”గా విరాజిల్లుతూ, ప్రసిద్ధి గాంచిన నరసింహస్వామి ఆలయం “ శ్రీ శోభనాచల- వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం”.
    నవ నారసింహ రూపములలో ఒకటైన వ్యాఘ్ర (పెద్దపులి ముఖం) రూపంలో దర్శనమిచ్చే ఏకైక నారసింహ క్షేత్రం ఈ ఆగిరిపల్లి క్షేత్రం . అంతేకాకుండా శివ మరియు కేశవ స్వరూపాలు ఒకే కొండపై వెలసిన దివ్య ఆలయం. పచ్చని చెట్లు, కమ్మని వాసనని అందించే పంటపొలాలు, మామిడి తోటలు, చుట్టూ పూల మొక్కలు, గోశాలలు మొ” వాటితో ప్రశాంత, గ్రామీణ వాతావరణాన్ని అందిస్తూ భక్తులకు కోరిన కోరికలను తీర్చే కొంగు బంగారమై నరసింహస్వామి ఈ కొండపై అవతరించి ఉన్నారు.
    తిరుమలలోలాగానే నాలుగు తిరుమాడ వీధులతో , మైసూర్ నగరాన్ని తలపించేలాగా నాలుగు వీధులలో నాలుగు ఆస్థాన మండపములతో, కొండకి నాలుగు దిక్కులా గల కోనేరులతో , ప్రధానంగా గ్రామానికి పశ్చిమాన నాలుగువైపులా మెట్లు, మధ్యలో ముఖమండపం కలిగి, తిరుమల కంటే నాలుగు రెట్లు పెద్దదైన వరాహ పుష్కరిణితో, స్థానిక వేదపాటశాలలో జరిగే నిత్య వేదఘోషతో, చక్కటి సుగంధాన్ని అందించే స్వామి వారి పూల తోటలతో ఆగిరిపల్లి గ్రామం నిత్య శోభాయమానంగా ప్రకాశిస్తున్నది.
    [03/02 3:00 pm] +91 96427 98389: సుమారు 800 మెట్లు కలిగిన ఈ కొండకు పై భాగం లో పరమేశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తే , కొండకు సరిగ్గా మధ్యభాగంలో ప్రధాన స్వామి అయిన నరసింహ స్వామి వ్యాఘ్ర రూపంలో భక్తులకు కనువిందు చేస్తారు. చూడటానికి గజం (ఏనుగు) ఆకారంలో ఉండే ఈ కొండకు సరిగ్గా దాని మీద ఊరేగే గజ రాజులా స్వామి ఆలయం ఉండటం విశేషం. కొండపైన స్వామి వారి దివ్య నిజ పాదుకలు మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. అలాగే కొండ పైకిఎక్కే మార్గమధ్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయం , కోదండరామస్వామి ఆలయములు దర్శనమిస్తాయి. దిగువ సన్నిధిలో శ్రీ శోభనాచల స్వామి ధ్రువ మూర్తి, శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారు, శ్రీ వేణుగోపాల స్వామి, గోదామ్మవారు, వల్లభారాజ స్వామి, సీతారామస్వామి, యోగనరసింహస్వామి సన్నిధిలు కలవు. అంతేకాకుండా ఈ క్షేత్రంలో చతుర్భుజములతో , శంఖు,చక్రములతో , యోగ ఆసనములో కూర్చుని దర్శనమిచ్చే శ్రీ బ్రహ్మభట్ట ఆంజనేయ స్వామి వారు భక్తుల కోరికలు తీర్చి , సర్వ రోగ, భయ, పీడా నివారణకు మార్గంగా దర్శనమిస్తారు.
    శ్రీ శుభవ్రత మహారాజు తపః ఫలముగా శుభగిరి పై శోభనాచల నరసింహ స్వామి స్వయంగా వెలిశారని బ్రహ్మాండపురాణం ఆధారంగా తెలుసుకోవచ్చు. ఈ గిరిని శుభగిరిగా, శోభనగిరిగా, స్వర్ణగిరిగా, కళ్యాణాద్రిగా, స్వప్నశైలముగా రకరకాల పేర్లతో పురాణాలలో వర్ణించారు. నూజివీడు జమిందారుల పాలనలో విశేష వైభవంతో ఈ ఆలయ వ్యవస్థ తీర్చిదిద్దబడి, వారిచే అనేక ఉత్సవములను ఎంతో వైభవంగా నిర్వహించుకున్న క్షేత్రం ఇది.కలియుగ ప్రత్యక్ష దైవం అయిన తిరుమల క్షేత్రంలో నిర్వహించే మాదిరిగానే ఇక్కడ కూడా శ్రీ వైఖానస ఆగమ విధానాన్ని అనుసరించి జరిగే స్వామి వారి అర్చనా విధానములు, ఉత్సవములు, పూజలు మనకు ముక్తి మార్గాన్ని అందిస్తాయి.

    శ్లో” శోభనాద్రి నివాసాయ శోభితార్ధ ప్రదాయినే,
    రాజ్యలక్ష్మీ సమేతాయ నారసింహాయ మంగళం.!!
    ఏమైనా ఎంతోమంది మహర్షులు, మునులు, తాత్వికులు ఈ గిరిపై తపమోనర్చి ఆ శక్తిని స్వామికి నివేదించారు అనటంలో సందేహములేదు. ఎంతోమంది పీటాధిపతులు స్వామిని దర్శించుకుని తరించారు, తరిస్తున్నారు.
    ఒకప్పుడు ఎంతోపేరుగాంచిన శ్రీ శోభనాచల టెక్టైల్స్ వంటి వ్యాపార సంస్థలు, శ్రీ శోభనాచల పిక్చర్స్ వంటి సినీ సంస్థలు స్వామి వారి నామధేయంతో , ఆయన అనుగ్రహంతో విరాజిల్లినవే. ప్రస్తుతం దేవాదాయ ధర్మదాయ శాఖ వారి నిర్వహణలో ఉన్న ఈ ఆలయం నిత్య నైమిత్తిక ఉత్సవములతో విరాజిల్లుతున్నది.

    ReplyDelete
  9. నమస్తే
    పాతరోజులు గుర్తుకువచ్చి కనులు భాష్పాలు తో నిండాయి
    ఇంతటి చక్కటి మరియు అతి విలువైన సాంస్కృతిక పాతరోజులు గుర్తుకువచ్చి కనులు భాష్పాలు తో నిండాయి
    చక్కటి రోజులు, చాలా అమాయకమైన ప్రజలు , మంచి నాగరికతతో నిండిన హ్రిదయాలు, సంగీత, నృత్య కళాసంపదలతో నిండిన భారతదేశం.
    ఎంత వ్రాసిన తక్కువే , అతివిలువైన , ఈ సాంస్కృతిక ప్రదేశాన్ని అందజేసిన మీకు నా ధన్యవాదములు
    ఉమా మహేశ్వర్

    ReplyDelete
  10. చాలా బావుందండి

    ReplyDelete
  11. చాలా బావుందండి

    ReplyDelete
  12. వెంకట రమణ గారూ , నా పేరు సుధాకర రెడ్డి. ముంబై లో వర్క్ చేస్తూ రిటైర్ అయిన తరువాత బెంగళూరు వచ్చాను. పాత తెలుగు వార, మాస పత్రికలూ collect చేస్తున్నాను. మీతో మాట్లాడాలని ఉంది. ఫోన్ no or email తెలియచేయ గలరా? sudhakara.basireddy@gmail.com is my email id.

    ReplyDelete