ఇంతకు ముందు పోస్ట్ చేసిన, హైదరాబాద్ కేంద్రం వారు ప్రసారం చేసిన, తిరుప్పావైలో ఎం. ఎల్. వసంతకుమారి గారు తమిళంలో పాడితే, శ్రీరంగం గోపాలరత్నం గారు తెలుగులో పాడటం జరిగింది. విజయవాడ కేంద్రం వారు ప్రసారం చేసిన తిరుప్పావైలో శ్రీరంగం గోపాలరత్నం గారు తమిళంలో పాడటం జరిగింది. లభ్యమైన 15, 16 పాశురములు పోస్ట్ చేస్తున్నాను. రికార్డింగు ఆశించినంత గొప్పగా రాలేదు. గోపాలరత్నం గారు గూడ తమిళంలో పాడారు అని తెలియ చెప్పటానికి పోస్ట్ చేస్తున్నాను. నెట్ లో ఎక్కడో చదివాను ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు మంగళంపల్లి వారు తమిళంలో పాడిన తిరుప్పావై ప్రసారం చేసేవారని. కింద చివరి ఫోటోలో వివరాలు చూస్తే నిజమే అనిపిస్తుంది.
15వ పాశురము
16వ పాశురము
ఆకాశవాణి వారి వాణి నుండి
|
Tags: thiruppavai, srirangam gopalarathnam, bhakthi ranjani,
AIR,
రమణగారు: ఆ పైని రెండు తమిళ పాశురాలు పాడింది గోపాలరత్నంగారు కాదు. అది ఆవిడ గొంతు కాదు. విజయవాడ కేంద్రంలో ప్రసారమైన తిరుప్పావై / సప్తపది చాలా ప్రఖ్యాతి పొందినది. బాలమురళిగారు తమిళంలో పాడితే దానికి తెలుగు సేత (సప్తపది) రత్నంగారు పాడారు. అది ఇప్పటికీ ప్రసారమవుతుంది. నెట్‌లో కూడా చాలా చోట్ల లభ్యమవుతుంది. నేనుకూడా చాలా యేళ్ళ క్రితం upload చేసాను.
ReplyDeleteశ్రీనివాస్ గారికి – ఈ మధ్య విజయవాడ వైపు వెళ్ళినపుడు అక్కడ భక్తి రంజనిలో ప్రసారమైనప్పుడు రికార్డు చేసిన పాశురములు ఇవి. వారు బాలమురళి గారి తిరుప్పావై ప్రసారం చేయలేదు. ఈ ప్రసారంలో నేను పోస్ట్ చేసిన తమిళ పాశురము తదుపరి వ్యాఖ్యానం చివరగా ఒక కృతి ప్రసారం చేశారు. రికార్డింగ్ బాగాలేక మొత్తం పోస్ట్ చేయలేదు. వారు ప్రసారం చేసిన దాంట్లో తెలుగు అనువాదం లేదు. నాకు మటుకు ఈ తమిళ పాశురాలు గోపాలరత్నం గారు పాడినట్లుగా అనిపించాయి. ఆవిడ చేత మళ్ళీ తమిళంలో పాడించి ఉండవచ్చు అనుకున్నాను.
ReplyDelete