Tuesday, January 20, 2015

సజీవ స్వరాలు – కొప్పవరపు సుబ్బారావు గారు

శ్రీ కొప్పవరపు సుబ్బారావుగారు నాటకరంగానికి సంబంధించిన విషయాలమీద చేసిన విశ్లేషణాత్మకమైన ప్రసంగం విందాము. ఇది 1954 నాటి రికార్డుట. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. అయితే నాటక కర్త, అలనాటి సంగీత దర్శకుడు శ్రీ కొప్పరపు సుబ్బారావు గారి పేరు కొంతమంది వినే వుంటారు. మరి ఈ కొప్పవరపు వారు ఎవరు అన్నది మొదట తెలియరాలేదు. మిక్కిలినేని వారి “నటరత్నాలు” పుస్తకంలో కొప్పరపు సరోజిని గారి గురించిన వ్యాసంలో ఈ కొప్పవరపు వారి ప్రస్తావన వచ్చింది. దీన్నిబట్టి వీరు ఆనాటి నాటక దర్శకులు అని తెలుస్తోంది. తెలిసినవారు ఎవరన్నా మరింత సమాచారం అందిస్తే సంతోషం. 










Tags: Koppavarapu Subbarao  

2 comments:

  1. కొప్పవరపు సుబ్బారావు గారి మనవడు ఫేస్బుక్ లో ఉన్నారు.. వీరే నమో హిందు మాతా సుజాత అనే పాట ను రచించారు. అనేక నాటకాలు, రచనలు రచించారు. ఆకాశవాణి వింజమురి ళక్ష్మి గారు వీరికి బంధువురాలను వారి మనవడు చెప్పగా విన్నాను

    ReplyDelete
    Replies
    1. మంచివిషయం తెలియజేసారు, ధన్యవాదాలు నరసింహరాజు గారు.

      Delete