Friday, January 23, 2015

అలనాటి మహత్తర రేడియో నాటిక “అనార్కలి”

శ్రీ బందా కనకలింగేశ్వరరావు గారి నిర్వహణ, శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గారి సంగీతం మరియు గానం, శ్రీ ఊటుకూరి సత్యనారాయణ రావు గారి రచన వెరసి అధ్బుత శ్రవ్యనాటకం “అనార్కలి” విని ఆనందించండి. పేర్లు మొదట మరియు చివర వినవస్తాయి. ఇందులో అనార్కలి – గోపాలరత్నం గారు, తాన్సేన్ – బందా గారు నటించారు. బహుశా ఇది ఓ యాభైఏళ్ల కిందటి రికార్డు అయివుండవచ్చు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి ప్రసారం. అసలే బందా వారిది తాన్సేన్ పాత్ర దానికితోడు ఓలేటి వారి పరకాయ ప్రవేశం ఇంకా చెప్పేదేముంది. 


















మొదటి భాగము


రెండవ భాగము 




Tags: Anarkali, Anaarkali, Banda Kanakalimgeshwararao, Oleti Venkateswarlu, Sriramgam Gopalarathnam, Vutukoori Satyanarayana, Radio Natakam, Akashavani, Kanakalingeswara rao, NCV Jagannadhacharulu, Nanduri Subbarao, Nandoori Subbarao, Vimjamoori Lakshmi

6 comments:

  1. అద్భుతం వెంకట రమణ గారూ. ఈ రేడియో నాటకంలో బందా వారికి ప్లేబాక్ ఓలేటి వారు. రేడియోలో ఇదొక అద్భుత ప్రయోగం.

    చాలా మంచి రేడియో నాటకం అందించారు రమణ గారూ. ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. శ్రీ శివరామప్రసాద్ గారు ఇలాంటి వాటికి తప్పకుండా స్పందిస్తారని అనుకున్నాను, ప్రతిస్పందించారు సంతోషం ధన్యవాదాలు. ఇది హైదరాబాద్ కేంద్రం వారు రిలేచేస్తే రికార్డు చెయ్యటం జరిగింది.

      Delete
  2. రమణ గారూ,

    విజయవాడ నుంచి ఒకాయన ఒక రేడియో బ్లాగు నడుపుతున్నారు. బ్లాగు పేరు "అల్ ఇండియా రేడియో". ఈ బ్లాగు ఎవరు నడుపుతున్నారో వివరాలు తెలియదు. మీకు లాగానే స్వంతంగా రికార్డు చేసి అందిస్తున్నారు. ఎందుకనో ఈ మధ్య అంత చురుకుగా లేరు. మీరు కూడా ఈ బ్లాగు చూడండి(ఇప్పటికే చూసి ఉండకపోతే)

    http://myradiofm88.blogspot.in/

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పిన బ్లాగు చూశాను. ఇంతకు ముందు కూడా మీరు ఒకసారి చెప్పారు. వారి పేరు “ఖ్యాతిక రామమ్” అని వారు బ్లాగులో పైన రాసిన వివరాల చివర్లో ఉన్నది. పోస్ట్ చేసిన వాటివి ఇంకొన్ని వివరాలు తెలిపితే బావుండేది. డౌన్లోడ్ చేసి వింటే కానీ తెలియటంలేదు. నాలాగా విజయవాడ నుంచి కూడా ఎవరన్నా రేడియో ప్రసారాలు రికార్డు చేసి పోస్ట్ చేస్తే ఇంతకు మించిన అరుదైన రికార్డులు లభిస్తాయి.

      Delete
  3. Incidentally I have most of the audios you posted sofar. But the above audio is certainly one that I wanted to put on-line since long years, also as a die-hard fan of Sri Voleti. Glad that you did that and thanks! Regards, Sreenivas

    ReplyDelete