Thursday, February 26, 2015

వెయ్యేళ్ళ పద్యకవితా వారసత్వం – నండూరి రామకృష్ణమాచార్య గారి స్వరంలో

“వెయ్యేళ్ళ పద్యకవితా వారసత్వం” అన్న అంశం మీద శ్రీ నండూరి రామకృష్ణమాచార్య గారి ప్రసంగం విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. ముందుగా ఘంటసాల గారి గళంలో ఓ పద్యం విందాము. 






ఘంటసాల గారి గళంలో ఓ పద్యం







నండూరి రామకృష్ణమాచార్య గారి ప్రసంగం

 





Tags: Nandoori Ramakrishnamacharya, Nanduri ramalrishnamacharya, Telugu padya kavitha  

Tuesday, February 24, 2015

ప్రయాగ రామకృష్ణ గారి నృసింహశతక పద్య విశ్లేషణ

“ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ప్రయాగ రామకృష్ణ”, సుస్ఫష్టమైన ఈ సుస్వరం గుర్తుండే వుంటుంది, మరి ఇవాళ వార్తలు కాదుగానీ వారి స్వరంలో శ్రీ శేషప్పకవి విరచితమైన నృసింహశతకం లోని ఓ మూడు పద్యాలకు వ్యాఖ్యానం విందాము. ఎందుకోగాని మొదటి పద్యంలోని నాలుగు పంక్తులు మినహాయించారు. ఆకాశవాణి వారి ప్రసారం. వారి రచనల ముఖచిత్రాలు ఒకసారి వీక్షిద్దాము. 




Source: The Hindu


























Tags: Prayaga Ramakrishna, Seshappa kavi, Nrusimha Sathakam

Friday, February 20, 2015

భానుమతి గారి “అత్తగారు - ఆవకాయ”

ఆవకాయ పెట్టటంకన్న యజ్ఞం చేయటం తేలిక, యజ్ఞం చేస్తే ఫలం అన్నా దక్కుతుంది, మరి కొంతమంది ఆవకాయ పెడితేనో ఫలితం కూడా దక్కదు. అసలు ఆవకాయ పెట్టటం అన్నదే ఓ పెద్ద ప్రహసనం. అందునా నూజివీడు చిన్నరసాలకు అలవాటుపడ్డ ప్రాణానికి వేరేకాయతో ముద్దదిగదు. విషయానికి వస్తే “ఆధునిక తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా నిలిచిపోయే పాత్రలు చాలా కొద్ది సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. ఆ చిరంజీవుల జాబితాలో చేరుతుంది భానుమతి ‘అత్తగారు’,” అన్నారు శ్రీ కొడవటిగంటి వారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భానుమతీ రామకృష్ణగారి “అత్తగారు – ఆవకాయ” మరొకమాటు రుచి చూద్దాము, 1958 నాటి ఆంధ్ర పత్రిక నుండి.









1961 నాటి మొదటి ముద్రణ 


1983 నాటి ఐదవ ముద్రణ 




మొదటి ముద్రణ నుండి

ఐదవ ముద్రణ  నుండి










Tags: Bhanumathi Ramakrishna, Attagari Kadhalu, Attagaru Avakaya






Wednesday, February 18, 2015

శ్రీపాద వారి - పుల్లంపేట జరీ చీర

ఆంధ్రభూమి 1940 నాటి సంచికలో వచ్చిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి చిన్నకధ “పుల్లంపేట జరీ చీర” చదువుదాము. అయితే ఇలా పాత సంచికలలో వచ్చిన వారి కధలు చాలా మటుకు సేకరించి విశాలాంధ్ర వారు “పుల్లంపేట జరీ చీర” అన్న పుస్తకం పేర ప్రచురించారు.













Tags: Sripada Subrahmanya Sastry, Pullampeta jaree cheera

Monday, February 16, 2015

పానుగంటి వారి – విద్యాభ్యసన పద్ధతి – ప్రహసనం

పానుగంటి వారిది మరొక ప్రహసనం చదువుదాము. ఇది “తెలుగువాణి” అన్న సంచికనుండి గ్రహించటం జరిగింది. దీనికంటే ముందు వారి గురించి 1935 నాటి “వినోదిని” సంచికలో వచ్చిన చిన్నపాటి వ్యాసం చూద్దాము 




















Tags: panuganti lakshmi narasimha rao, prahasanamulu

Saturday, February 14, 2015

వడ్డాది పాపయ్య గారి “యువ” చిత్రములు – నాల్గవ భాగము

ఇవాళ వడ్డాది పాపయ్య గారివి ఇంకో 80 చిత్రాలవరకు చూద్దాము. వీటితో కలిపి ఇప్పటిదాకా 320 చిత్రాలు చూసినట్లు అవుతుంది. వీరు నక్షత్రముల పేర్ల మీద గీసిన నక్షత్రకన్యల చిత్రాలు అలాగే పూర్ణిమ / పున్నమి అన్న అంశం మీద గీసిన చిత్రాలు లభించినవి ఒకచోటగా తేవటం జరిగింది. కాస్త శ్రవణానందానికి షావుకారు, విలేజ్ లో వినాయకుడు చిత్రాల టైటిల్ సంగీతం వింటూ చూద్దాము. 



















































































































Tags: Vaddadi Papaiah, Yuva, Vaddadi papayya