Saturday, December 15, 2012

అలనాటి గ్రాంఫోన్ పాటలు

ఆచార్య మొదలి నాగభూషణ శర్మ గారు అలనాటి గ్రాంఫోన్ పాటలను  LP లుగా ఉన్న వాటిని CD లుగా రూపాంతరం చేసి పట్టుకు వచ్చారు. రెండేళ్ల క్రితం విడుదల చేసిన మొదటి భాగంలో ఇరవై మంది గాయనీ, గాయకులకు చెందిన 35 పాటలు, పద్యాలు మరియు రెణ్ణెల్ల క్రితం వచ్చిన రెండవ భాగంలో 25 మంది గాయనీ, గాయకులకు చెందిన ఏకంగా 58 పాటలు, పద్యాలను CDల రూపంలోను, ఆ గాయనీ, గాయకులకు చెందిన ఫోటోలు, ఇతర వివరాలు పుస్తక రూపంలోను పొందుపరచారు . అయితే ఆ పాటల సాహిత్యం మటుకు పొందుపఱచలేదు.





ముందు పాలలో వి. ఎ. కె. రంగా రావు గారి జనరంజని కార్యక్రమం రెండవ భాగంలో ఆయన ప్రస్తావించి వినిపించకుండా వదిలేసిన వల్లూరి జగన్నాధరావు గారి కొయ్యోడి పాట పైన చెప్పిన  CDలలో ఉన్నది సగం వరకు, ఆయన కొద్దిగా రుచి చూపించి ఆపేసిన ఇంకో కొయ్యోడి పాను పూర్తిగాను విందురుగాని. ఈ పాట పాడే నాటికి జగన్నాధరావు గారి గొంతుతో గొంతు కలిపిన,  అవసరాల (వింజమూరి) అనసూయ గారికి తొమ్మిదేళ్లని రంగారావు గారు రాసుకొచ్చారు. ఆ లెక్కన ఇది రమారమి 83 ఏళ్ల కిందటి  పాట. ఆ కొయ్యోడి పాట సాహిత్యాన్ని కూడా కింద ప్రచురించాను.  ఈ పాట సాహిత్యానికి మూలం రంగారావు గారి మరో ఆలాపన. ముందుగా రంగారావు గారి మాటలు ఆ తదుపరి కొయ్యోడి పాటలు




ఓ చుక్కల కోగట్టూకోని      చుట్టూ గోటూ రైకా తొడిగి
బుఱ్ఱా నున్నగ దువ్వూకోని   బొట్టూ కాటుక బెట్టూకోని
నోటిలో సుట్టా బెట్టూకోని       గోటుగా నే నడుసూకుంటా
సక్కానమే సూసూకుంటా   ఎక్కడి కెళ్తవు చిట్టెమ్మంటే 

పోలేరమ్మ మెరక మీకి    పుల్లల కెల్తను కొయ్యోడో
య్యో కొయ్యోనే పుల్లల కెల్తను కొయ్యోడో య్యో కొయ్యో
కర్రా చేతా గట్టూకోని         కిర్రూ చెప్పులు తోడుగూకోని
పాయల మొల్తాడేసుకోని   కాయా పంచెలు గట్టూకోని
క్కలాకు లేసుకోని        టెక్కుగా సరుకేసుకోని
ఎక్కడి కెళ్తవు కొయ్యోడంటే

పోలేరమ్మ మెరకల మీదికి పొగాకు కెల్తను చిట్టెమ్మీ లమ్మీ చిట్టెమ్మీ
మన మిద్దర మొక్కడ కెల్దామే మ్మీ చిట్టెమ్మీ

చీటికి మాటికి చిట్టెమ్మంటే   చీటికి మాటికి చిట్టెమ్మంటే
చీపురు దెబ్బలు తింటవురో రయ్యో కొయ్యోడా
నీవు చీపురు దెబ్బలు తింటవురో రయ్యో కొయ్యోడా

1 comment: