Sunday, December 9, 2012

మొక్కపాటి వారి పార్వతీశం

mokkapati narasimha sastry  మొక్కపాటి వారి barrister parvateesam పార్వతీశం గురుంచి తెలియని వారుండరు. నాకు మటుకు నాకు ఏదన్నా ఊరికి ప్రయాణానికి ఏం తీసుకెళ్లాలి అంటే గుర్తుకు వచ్చేది పార్వతీశం గారే. మొక్కపాటివారు తొలి, తుది పలుకులతో పార్వతీశం పుట్టు పూర్వోత్తరాలు తెలిపారు. అందులో మొదటి భాగం ఆంధ్రజ్యోతి వార పత్రికలో ప్రచురిత మవుతున్నప్పుడు “నార్ల” వారి ప్రోద్బలంతో రెండవ భాగం రాయటం జరిగిందన్నారు. ఆంధ్రజ్యోతిలో ఈ సీరియలుకు బొమ్మలు cartoonist babu “బాబు” గారు వేయటం జరిగిందని, ఆ ప్రతులు లభ్యం కాకపోవటంతో తిరిగి బొమ్మలు “బాపు” గారితో వేయించినట్లుగా అభినందన పబ్లిషర్స్ వారు ప్రచురించిన పార్వతీశం పుస్తకంలో పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతిలో 19-12-1969 నుండి 14-08-1970 మధ్య కాలంలో మొదటి భాగం, రెండవ భాగం ప్రచురితమైనది. నేను భద్రపరిచిన ఈ భాగాల నుండి బాబు గారు వేసిన కొన్ని బొమ్మలు ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. కట్టు, బొట్టు, తీరు, తెన్ను మూర్తీభవించేలా అమాయకత్వం ప్రస్ఫుటించేలా, బాబు గారు పార్వతీశాన్ని తీర్చి దిద్దారు. కావాలంటే బొమ్మల మీద క్లిక్ చేసి పెద్దవిగా చేసి చూడండి




 











మొదటి భాగంలో మనకు నాయిక పాత్ర కనబడదు. కానీ ఆ పాత్రను ప్రవేశబెట్టి 1940 లోనే పార్వాతీశాన్ని తెరకెక్కించారు మనవాళ్లు.  ఆ చిత్రం పోష్టర్స్ క్రింద చూడండి. ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో. telugu film posters


 
 
















ఇన్ని విషయాలు తెలుసుకున్నాక ఆ సినిమాలోని ఒక పా కూడా వింటే బావుంటుంది కదా.  దాంట్లోన్చే ఈ   పోయిరా ప్రియుడా లండన్ పోయిరా ప్రియుడా అంటూ g varalakshmi జి. వరలక్ష్మి గారు పాడిన పాట. బహుళ ప్రచారం పొందిన పాటని వి. ఎ. కె. రంగారావు గారు కితాబు ఇచ్చారు. ఆ పాట సాహిత్యాన్ని కూడా  క్రింద పోస్ట్ చేస్తున్నాను. 


పోయిరా ప్రియుడా లండన్ పోయిరా ప్రియుడా
భూములెన్నో దాటీ, సీమ లెన్నో దాటీ
వాయు గమనము మీటీ, వార్చులేడును దాటి త్వరగా
పోయిరా ప్రియుడా లండన్ పోయిరా ప్రియుడా
ఆ దేశములో అతివల జూచి నను మరువకు ప్రియుడా
పై పై తళుకే పౌడరు బెళుకే
ఓ మై డియర్, హౌ డూ యు డూ, స్, నొ, ఆల్ రైట్ అను కులుకే
చదువుల కొరకై పర దేశములకు భారత యువకులు పోలేదా
పర భాషలతో, పర భామలతో భారత భూమికి దిగలేదా
ఆ విధముగా చేయకుమురా ఆనసుమి నాపై ప్రియుడా
పోయిరా ప్రియుడా లండన్ పోయిరా ప్రియుడా


No comments:

Post a Comment