“ఖాయము కాదిలన్ మనుజ కాయము, కాన వృధా యొనర్చకీ ప్రాయము”
ఘంటసాల గారు
మధురముగా ఆలపించిన “నాగార్జునకొండ” పద్యములు వారి ప్రైవేట్ పాటలయందు ఆసక్తికలవారు వినేవుంటారు. అయితే ఒక్కోసారి మనకు పాటవెనుక వివరాలు తెలియవు. ఈ నాగార్జునకొండ
కావ్యరచయిత డా. సముద్రాల ఆంజనేయులు గారు. ఆయనే స్వయంగా వారి కావ్య ఆరంభములో ఈ పాట పూర్వాపరాలు వివరించారు. డా. సముద్రాల
ఆంజనేయులు గారి ఫోటో, ఆ పాట యొక్క వివరాలు, ఘంటసాల గారు ఆలపించిన పద్యములు పోస్ట్
చేస్తున్నాను.
అయితే
తెలిసినంతవరకు మాధవపెద్ది, పిఠాపురం గార్లు పాడినపాటలు మనకు అందుబాటులో లేవు. ఎవరన్నా ఆ పాటలు
వెలుగులోకితెస్తే బావుంటుంది.
ఘంటసాల గారి గళంలో
ఆ పద్యాలను ఈ క్రింది లింకు ద్వారా ఆస్వాదిద్దాము.
No comments:
Post a Comment